ముందుకు సాగరా ! ముందుకు సాగరా!!

ముందుకు సాగరా ! ముందుకు సాగరా !!
ఆకలేసినా,
దాహమేసినా,
చెమట కారినా,
నెత్తురు పారినా,
తాపసివై,
పిపాసివై,
ముందుకు సాగరా ! ముందుకు సాగరా !!

మెరుపు మెరిసినా,
వాన కురిసినా,
చీకటి కమ్మినా,
దెబ్బ తగిలినా,
తనువులో,
అణువణువులో,
రక్తం ఉరకలెత్తనీ,
పరుగుపెట్టనీ,
హృదయం పగిలినా,
ప్రళయం వచ్చినా,
ముందుకు సాగరా ! ముందుకు సాగరా !!

ఎండకు ఎండినా,
వానకు తడిచినా,
చలికి వణికినా,
ఓటమికి విసిగినా,
పరిక్లమిస్తూ,
పరిప్లవిస్తూ,
భయన్ని చంపుతూ,
ధైర్యం నింపుతూ,
ఉరకలేస్తూ, కేకలేస్తూ,
ముందుకు సాగరా ! ముందుకు సాగరా !!

దిక్కులు దాటుతూ,
హద్దులు మీరుతూ,
మత్తుని వీడుతూ,
నడుము వంచుతూ,
నదిలా ప్రవహిస్తూ,
కాంతిలా ప్రసరిస్తూ,
కండలు కరిగినా,
కలలు చెదిరినా,
నిశీధిలో, నిశిరాతిరిలో,
ఒంటరివై, ఒక్కడివై,
ముందుకు సాగరా ! ముందుకు సాగరా !!

నడుస్తూ, నడిపిస్తూ,
కదులుతూ, కదిలిస్తూ,
పడుతూ, నిలబడతూ,
నాయకుడివై,
ఉద్యమకారుడివై,
శోకం తీరగ, లోకం మారగ,
ముందుకు సాగరా ! ముందుకు సాగరా !!.....

Related