మన శరీరానికి నీరు చాలా అవసరం. ఎందుకంటే మన శరీరం 60% వరకూ నీటితో నిర్మితమైనదని జగమెరిగిన సత్యం. అంతేగాక మన ప్రధాన అంతర్గత అవయవాలు ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కండరాలు, మెదడు, గుండె మరియు చర్మం కూడా 60% కంటే ఎక్కువ నీటిని కలిగి ఉంటాయి. వాస్తవానికి, నీరు లేకుండా జీవితం లేదనే చెప్పాలి.
శరీరంలో తగినంత నీటి శాతం లేకపోవడం వల్ల, మన అంతర్గత అవయవాలపై చాలా ముఖ్యమైన ప్రభావాన్ని చూపుతుంది. మూత్రపిండంలో వివిధ రకాల రాళ్ళు కూడా ఏర్పడతాయి. మీ కుటుంబానికి / స్నేహితులకు / సహోద్యోగులకు ఈ ఆర్టికల్ ద్వారా మీరు తెలుసుకున్న విషయాలను తెలపండి !!!
నీరు ఎంగిలితో కలిపి తాగండి
నీటిని ఎప్పుడూ కూడా నేరుగా గొంతులో పోసుకుని తాగకూడదు. సాధ్యమైనంత ఎంగిలితో బాగా కలిసేలా తాగాలి. అప్పుడు ఒంటికి పడుతుంది. ఈ విషయం చాలామందికి తెలియదు అనే చెప్పాలి.
ఉదయం లేచిన వెంటనే నీరు తాగడం అలవాటు చేసుకోండి
లేచిన వెంటనే నీరు తీసుకోడం వలన మల విసర్జన సరిగ్గా జరిగి మలబద్దకాన్ని నివారిస్తుంది. అంతేగాక పెద్ద ప్రేగులు శుభ్రపడతాయి మరియు ఎక్కువ పోషకాలు శరీరానికి అందడానికి సహకరిస్తుంది.
పని విరామాల మధ్య నీరు త్రాగాలి
చాలా మంది పనిలో పడితే నీటిని తీసుకోడం మర్చిపోతుంటారు. అలా కాకుండా ప్రతి 30 నిమిషాలకు ఒక నిమిషం విరామం కేటాయించి ఆ సమయంలో నీటిని తాగండి. ఇలా శరీరం ఉత్తేజితం అవుతుంది.
కాచి చల్లార్చిన నీరు త్రాగడానికి ప్రయత్నించండి
ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లను నివారించడం ద్వారా మన అంతర్గత అవయవాలు సరిగా పనిచేయడానికి సహాయపడుతుంది. మన ప్రస్తుత దినచర్యలో, నీటిని వేడి చేసి నిల్వ చేయడం చాలా కష్టసాధ్యమైన పని. కాబట్టి మీ సౌలభ్యం ప్రకారం ప్రతి 7/15/30/60 రోజులకి ఒకసారైనా ఇలా చేయడానికి ప్రయత్నించండి. వీలైతే రోజూ వెచ్చని నీరు త్రాగాలి.
సాధ్యమైనంత ఎక్కువ నీరు త్రాగడం అలవాటు చేసుకోండి
రోజుకి కనీసం 3 లీటర్లు త్రాగండి. ముఖ్యంగా వేసవిలో ఇంకో 1 లేదా 2 లీటర్లు ఎక్కువ త్రాగడానికి ప్రయత్నించండి. కొన్ని రోజులు ఎక్కువగా తాగి, ఆకస్మికంగా మోతాదును తగ్గించకూడదు.
భోజన సమయంలో ఎలా తాగాలి?
భోజన సమయంలో భోజనం చేయడానికి తగినంత నీటిని మాత్రమే తాగండి. ఎక్కువ తాగితే సరిగా అరగక వాంతులు అయ్యే ప్రమాదం ఉంది. ఎక్కువ నీరు తాగలనే ఉద్దేశంతో ఉన్నవారు భోజనానికి కనీసం ఒక గంట ముందు మరియు తరువాత వ్యవధి ఉండేలా చూసుకోండి.
నిద్ర మధ్యలో కుదిరినప్పుడు నీరు సేవించండి
మీ నిద్ర మధ్యలో లేచినప్పుడు కనీసం ఒక గ్లాసు నీరు తీసుకోండి. సాధారణంగా మనం 6-8 గంటలు నిద్రపోతాము. మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరంలో లోపలి జరిగే క్రియలకు నీరు ఎంతగానో అవసరం. ముఖ్యంగా వేసవి కాలంలో అర్థరాత్రి సమయమున నోరు ఎండిపోతుంది. ఆ సమయంలో బద్ధకానికి తావు ఇవ్వకుండా నీరు త్రాగండి.
రాగి మరియు ఉక్కు పాత్రలను నిల్వకు వినియోగించండి
ప్లాస్టిక్ బాటిల్స్ కు సాధ్యమైనంత దూరంగా ఉండటం మంచిది. ప్లాస్టిక్ బాటిల్‌లో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. రాగి బ్యాక్టీరియా వృద్ధిని నిలువరించడమే కాకుండా చంపడానికి సహకరిస్తుంది. ఇది మీ బడ్జెట్‌లో లేదని మీరు భావిస్తే, స్టీల్ బాటిల్‌ను వినియోగించడానికి ప్రయత్నించండి.
బయటకు వెళ్లే సమయంలో నీటి బాటిల్ ని తీసుకెళ్లడం అలవాటు చేసుకోండి
వాటర్ బాటిల్ తీసుకెళ్లడం చాలా మంచి అలవాటు. మీరు జిమ్ / ఆఫీసు / సెలవుదినం కోసం బయటకు వెళ్ళేటప్పుడు దానిని తీసుకెళ్లే అలవాటు ఉత్తమమైనది.
ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.