కరోనా వైరస్ (కోవిడ్-19): లక్షణాలు, కారణాలు, నివారణలు

కరోనా వైరస్, చైనాలో పుట్టి ప్రపంచ దేశాలకు వ్యాపించి అగ్రదేశాలను సైతం ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టి, లక్షల మంది ప్రాణాలను బలి తీసుకున్న మహమ్మారి. ఈ వైరస్ గురించి ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన విషయాలను తెలుసుకుందాం.లక్షణాలు


ఈ వైరస్ మన శరీరంలోకి వచ్చిన తరువాత శరీరమంతా వ్యాపించి లక్షణాలు బయట పడటానికి సుమారు 5 నుంచి 15 రోజుల వరకు పట్టవచ్చు.


ఈ క్రింది లక్షణాలు ప్రధానమైనవి. అందరికీ అన్ని లక్షణాలు ఉండకపోవచ్చు.


 • జ్వరం 100° F దాటుతుంది
 • ఎడతెరిపి లేకుండా దగ్గు రావడం
 • వాసన మరియు రుచి కోల్పోవడం
 • తీవ్రమైన ఒళ్ళు నొప్పులు రావడం
 • ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారడం

పైవి కాకుండా ఇంకా కొన్ని లక్షణాలు కూడా ఈ క్రింద తెలిపినవి ఉండవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇవి కనిపించవచ్చు.


 • తలనొప్పి
 • వికారం, వాంతులు
 • విరేచనాలు

కొన్ని సార్లు పై లక్షణాలు కనిపించకుండా నే కోవిడ్-19 పాజిటివ్ రావడం కూడా జరుగుతుంది.కారణాలు


 • కరోనా సోకిన వారు దగ్గినా, తుమ్మినా వ్యాపించిన ఆ వైరస్ మన కళ్ళు, ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది.
 • మన చేతి మీదకి ప్రవేశించినప్పుడు, మనకు చేతులు శుభ్రం చేసుకోకుండా మొహం తుడుచు కోవడం లాంటివి చేస్తే మనలోకి ప్రవేశిస్తుంది.


జాగ్రత్తలురాకుండా తీసుకోవాల్సినవి


 • బహిరంగ ప్రదేశాలలో ఎల్లప్పుడూ మాస్కుని ధరించాలి.
 • బయటకి వెళ్ళి వచ్చినప్పుడు మరియు తినే ముందు తప్పనిసరిగా చేతులను సబ్బుతో లేదా శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి.
 • చేతులు శుభ్రం చేసుకోకుండా మొహాన్ని, కళ్ళు, నోరు, ముక్కు ప్రదేశాలలో తాకకూడదు.


లక్షణాలుంటే తీసుకోవాల్సినవి


 • ముందుగా మిగతా వారి నుంచి వేరుగా ఉండండి.
 • ఏ లక్షణం బయట పడితే దానికి తగ్గ మాత్రలు వేసుకోండి (ఉదా: జ్వరం వస్తే జ్వరం మాత్ర, దగ్గు వస్తె సిరప్).
 • ఉపవాసం లేదా ఖాళీ కడుపుతో ఉండకూడదు.
 • చల్లని నీళ్లు అసలు త్రాగొద్దు. కాచిన నీటిని ఫ్లాస్కులో పోసుకుని తాగండి.
 • రోజూ కనీసం 4 లేదా 5 సార్లు వేడి నీళ్ళల్లో [పసుపు + (జండు బాం/ అమ్రుతంజన్/ఇన్హేలర్ మాత్రలు)] వేసి ఆవిరి పట్టుకోండి.
 • మిరియాలు, పసుపు, అల్లంతో కషాయం మూడు పూటలా తాగండి. ఈ పదార్థాలు (నిమ్మపండు, వాము, శొంఠి, తులసి ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు) కూడా ఉపయోగించడం మంచిది.
 • చేతులను శుభ్రం చేసుకుని తరచుగా వేడి నీటితో (ఉప్పు + పసుపు) ముక్కుని నోటిని శుభ్రం చేసుకోండి.
 • నారింజ పళ్లు రోగ నిరోధక శక్తి కి మంచిది.
 • తినే/తాగే పదార్థాలలో ఉసిరి, వాము, శొంఠి, తులసి ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు వంటి పదార్థాలు ఉపయోగించండి.
 • ఇంటి ఆవరణంలో ఆవు పిడకలు, కర్పూరంతో ధూపం వేయడం మంచిది.


సహాయం


కరోనా వల్ల ఇబ్బంది అధికం ఇంట్లో ఉండలేని పరిస్థితుల్లో సహాయం కొరకు ఈ క్రింద తెలిపిన ప్రభుత్వ సహాయ సిబ్బందికి కాల్ చేయవచ్చు.


కేంద్ర ప్రభుత్వం: 011-23978046


ఆంధ్రప్రదేశ్ + తెలంగాణ: 104


ఈ మహమ్మారి సోకినవారు త్వరగా కోలుకోవాలని, దానికి తగిన సహకారం ఆయా ప్రభుత్వాలు అందించాలని, అలాగే మనం వైరస్ వ్యాప్తి చెందకుండా బాధ్యతగా మెలగాలని కోరుకుందాం.


Related