కొబ్బరి: ఉపయోగాలు

ప్రతి రోజూ కొబ్బరి నీళ్లు తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటారు. మన శరీరంలోని విష పదార్థాలను మూత్ర విసర్జన ద్వారా బయటకు పంపడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

కొబ్బరి నీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. శరీరంలో నిర్జలీకరణ (నీటి లేమి) ని తగ్గిస్తుంది. ఎండా కాలంలో అధిక వేడి నుండి నుండి తట్టుకోవడానికి చాలా ఉపకరిస్తుంది.

ప్రతిరోజూ ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క తీసుకోండి, ఇది మతిమరుపును తగ్గించడానికి, మన మెదడు సరిగ్గా పనిచేస్తుంది.

ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారంలో కొబ్బరి వినియోగిస్తే, అది మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

కొబ్బరితో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. రక్తంలో ఉండే చక్కెర స్థాయిని తగ్గించి, మధుమేహం నియంత్రణకు సహకరిస్తుంది.

పచ్చి కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల, అవి గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తుంది.

కొబ్బరి లో నూనె అధికంగా ఉంటుంది. అది మన కడుపులోని క్రిములను నాశనం చేస్తుంది. అంతే గాక కడుపులో విడుదలయ్యే యాసిడ్లు సాంద్రతను అణచి వేసి, కడుపు మంటను తగ్గిస్తుంది.

కొబ్బరి, బెల్లంతో నంచుకుని తింటే మోకాళ్ళ నొప్పులు నియంత్రిస్తాయి అని పెద్దలు అంటారు.

Related