Recommended
రోజూ ఎక్కువ నీరు త్రాగడానికి ఉత్తమ మార్గాలురోజూ ఎక్కువ నీరు త్రాగడానికి ఉత్తమ మార్గాలుTHE MIND - An Invisible Friend & EnemyTHE MIND - An Invisible Friend & Enemyమహా శివరాత్రిమహా శివరాత్రిLCD, LED, OLED, AMOLED know more about display screen technologies LCD, LED, OLED, AMOLED know more about display screen technologies వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా సిగ్నల్ యాప్వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా సిగ్నల్ యాప్స్వప్నాన కురిసిన వానస్వప్నాన కురిసిన వానMy Bicycle Journey to HomeMy Bicycle Journey to Homeనడవవోయ్ ముందుకు ! నడవవోయ్ ముందుకు !!నడవవోయ్ ముందుకు ! నడవవోయ్ ముందుకు !!

గ్యాస్ట్రిక్ సమస్యను సులభంగా ఎలా నివారించాలి

మన ప్రస్తుత బిజీ దినచర్యలో, మనం అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాము. వాటిలో ఒకటి గ్యాస్ట్రిక్ సమస్య. మన ఆధునిక సంస్కృతి దృష్ట్యా వద్దన్నా వచ్చే రోగాలలో ఇదొకటి అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇది చాలా సాధారణమైన మరియు చికాకు కలిగించే ఆరోగ్య సమస్య. ఇది మన శరీరంలో తీవ్రమైన శారీరక అసమతుల్యతను కలిగిస్తుంది.


1. సమయానికి ఆహారం తీసుకోండి


ఇది ప్రధానంగా చేయవలసిన పని. ఒకవేళ, మీరు డైట్‌లో ఉంటే, మీరు కనీసం కొంత ఆహారం అయినా తీసుకోడం ఉత్తమం. అసలు తినకుండా మాత్రం ఉండవద్దు.




2. భోజనానికి ముందు వెల్లుల్లి తీసుకోండి


ఉడికించిన వెల్లుల్లి 4 నుండి 10 ముక్కలు భోజనానికి ముందు తీసుకోండి. ఇది సరైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. మీరు వాటిని మీ కూరలలో కూడా ఉపయోగించవచ్చు.





3. తినేటప్పుడు అనవసరంగా మాట్లాడకండి


నిశ్శబ్దంగా తినండి మరియు మీరు తినే వాటిపై దృష్టి కేంద్రీకరించి, స్పృహతో తినండి. ఎందుకంటే మీరు తినేటప్పుడు లేదా త్రాగేటప్పుడు మాట్లాడినట్లయితే గాలిని మింగేస్తారు.


4. తిన్నాక 5-15 నిమిషాలు వజ్రాసనం వేయండి


గ్యాస్ట్రిక్ సమస్యతో పోరాడటానికి ఇది ఒక ఉత్తమమైన పద్ధతి అని చెప్పవచ్చు. ఇది సరైన జీర్ణక్రియకు మరియు గ్యాస్ట్రిక్ సమస్యతో పోరాడటానికి సహాయపడుతుంది. ఆహారం తీసుకున్న తర్వాత మీరు చేయగలిగే ఏకైక ఆసనం ఇది.



Photo by Elly Fairytale from Pexels

5. నిమ్మరసం బేకింగ్ ఉప్పుతో కలిపి తీసుకోండి


ఇది మన శరీరం నుండి వాయువును బయటకు నెట్టడానికి ఒక ప్రభావవంతమైన మార్గం మరియు ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు వాడటం మంచి ఫలితాన్ని ఇస్తుంది.




6. త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి


త్వరగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తీసుకోండి. ఒకవేళ కుదరకపోతే, త్వరగా జీర్ణం అవటానికి తినవలసినవి తీసుకోండి. ఉదాహరణకు మీరు కోడి గుడ్డు తిన్నారనుకోండి, అది అరగాలంటే ఒక చిన్న బెల్లం ముక్క తింటే సరిపోతుంది. జీలకర్ర, సోపు, అల్లం మరియు ఇంగువ వంటి పదార్థాలు మిగిలిన ఆహార పదార్థాల అరుగుదలకు బాగా తోడ్పడతాయి. కనుక వాటిని సాధ్యమైనంతవరకు మీ ఆహార తయారీలో వినియోగించండి.


ఇలా పైన చెప్పిన విషయాలు అనుసరించి మీరు ఆరోగ్యంగా మరియు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము.


Related