ఆస్తమా (ఉబ్బసం): లక్షణాలు, కారణాలు, నివారణలు

ఆస్తమాను ఉబ్బసం అని కూడా అంటారు. ఇది ఒక తీవ్రమైన దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి. ఈ వ్యాధి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికీ వస్తుంది. దీనిని తొలి దశలోనే గమనించి తగు జాగ్రత్తలు తీసుకుని నియంత్రించడం ఉత్తమం. 

అస్తమాలో చాలా రకాలున్నాయి. అందులో ఎలర్జిక్‌, నాన్‌ ఎలర్జిక్‌ ఆస్థమాలు ప్రధానమైనవి. ఇది అంటువ్యాధి కాదు. శరీరంలో ఏర్పడే ఒక రకమైన అలెర్జీ వల్ల ఇది ఏర్పడుతుంది.


లక్షణాలు


 • ఆయాసం
 • పిల్లి కూతలు
 • ఛాతీ పట్టేసినట్లు అనిపించడం
 • దగ్గు


కారణాలు


శ్వాస నాళాలు సంకోచించడం వల్ల ఆయాసం వస్తుంది. వాతావరణ కాలుష్యం వల్ల రోజు రోజుకి ఈ సమస్య ఎక్కువవుతుంది.


తల్లిదండ్రుల ద్వారా పిల్లలకి వచ్చే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులలో ఒకరికి ఉంటే 25%, ఇద్దరికీ ఉంటే 50% పిల్లలకి ఆస్తమా సంక్రమించే ప్రమాదం ఉంది.నివారణలు


 • తొలి దశలోనే నియంత్రించడానికి ప్రయత్నించాలి.
 • యాంటీ ఇన్‌ప్లమేటరీ, యాంటీ అస్త్మాటిక్ ఆహారాన్ని తరచుగా తీసుకోవాలి.
 • ఆయాసం మొదలవుతుంది అని తెలియగానే ఆవిరి పట్టుకోవాలి.
 • కమల, నారింజ, ఆపిల్, నిమ్మరసం మొదలగునవి ఆస్తమా ప్రభావాన్ని తగ్గిస్తాయి.
 • ఆకు కూరల్లో పాల కూర చాలా మంచిది.
 • వ్యాయామం మంచిది. రక్త ప్రసరణ బాగా జరిగి శ్వాస నాళాలలోని కొవ్వు కరుగుతుంది.
 • ప్రాణాయామం చాలా మేలు చేస్తుంది. ప్రతి రోజు ఒక 5 లేదా 10 నిమిషాలు కపాల భారీ ప్రక్రియను చేయడం మంచిది.


జాగ్రత్తలు


 • ధూమనానానికి దూరంగా ఉండాలి.
 • ధుమ్ము ధూళికి దూరంగా ఉండాలి.
 • అతి చల్లని పదార్థాలు అతిగా తినకూడదు.
 • వానలో తడవకుండా ఉండటం మంచిది.
 • తల స్నానం చేసి వెంటనే నిద్రించరాదు (అత్యవసరం అయితే దిండు ఎత్తుగా ఉండేట్లు చూసుకోవాలి).
 • ఘాటు వాసనలకి దూరంగా ఉండాలి. తుమ్ములు రాకుండా జాగ్రత్త పడాలి.
 • ముఖ్యంగా చలి కాలంలో జాగ్రత్తలు వహించాలి.
 • ఊబకాయులకి ప్రమాదం ఎక్కువ, వారు ఎక్కువ శ్రద్ధ వచ్చించాలి.
 • పెంపుడు జంతువులకు, వాటి వెంట్రుకలకు దూరంగా ఉండాలి (పిల్లి బొచ్చు). అత్యవసరం అయితే మాస్క్ నీ ధరించాలి.
 • సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఇన్హేలర్ ను పక్కన ఉంచుకోవాలి, ఒంటరిగా ఉండటం మంచిది కాదు.

Related