పసుపు ఉపయోగించకుండా మన తెలుగు వారు ఏ కూరను చేయరు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే పసుపు విషతుల్యమైన పదార్థాలను సంహరిస్తుంది. ఆయుర్వేదంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది.
పసుపుని మరిగించిన పాలలో కలిపి తీసుకుంటే, జలుబు, దగ్గు నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. రాత్రి తాగితే నిద్రకు సహకరిస్తుంది.
వేడి నీళ్ళల్లో చిటికెడు పసుపు వేసి ఆవిరి పట్టుకుంటే, ఊపిరి తీసుకునేటప్పుడు ఉండే ఇబ్బందిని తక్షణమే తొలగిస్తుంది.
చర్మం బాహ్యకాంతికి, లోపల శుద్ధికి సహకరిస్తుంది.
రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. రక్తనాళాలలో ఉండే క్రొవ్వును తగ్గించి, హృదయాన్ని గుండెపోటు నుంచి రక్షిస్తుంది.
ఎముకలకు పటుత్వం పెంచుతుంది. కీళ్ల వాపును తగ్గిస్తుంది.
ముఖంపై రాస్తే మొటిమలను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.
గాయాల మీద రాస్తే, రక్తస్రావాన్ని ఆపడమే కాకుండా త్వరగా మానేలా చేస్తుంది.
ఇంటి గుమ్మానికి రాస్తే, హానికరమైన క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
విషతుల్యమైన పదార్థాల నుంచి, నోటిని, శ్వాసకోశాన్ని, జీర్ణాశయాన్ని, కాలేయాన్ని రక్షిస్తుంది.
పసుపు, ఉప్పు బాగా కలిపిన పొడి మిశ్రమాన్ని, దంతాలను శుభ్రం చేయడానికి వినియోగిస్తే, పంటి నొప్పి, నోటి దుర్వాసనను తొలగిస్తుంది.
మాంసాహారం చేసేటప్పుడు ముందుగా మాంసాన్ని పసుపు, ఉప్పు బాగా పట్టించి కాసేపు వేచి ఉండి, తరువాత వేడి నీటిలో కడిగితే విష పదార్థాలు నుంచి మన శరీరానికి రక్షణ లభిస్తుంది.
స్త్రీలలో నెలసరి సక్రమంగా జరగటానికి ఉపయోగపడుతుంది.