స్వప్నాన కురిసిన వాన

తనువును తాకెను కుసుమలవర్షం,
మదిలో మెదిలేను తెలియని మర్మం,
గగనాన్ని కమ్మెను నల్లని మేఘం,
మేఘలు చేసెను బిగ్గర రాగం,
నా మోమును తాకేను చల్లని పవనం,
నా మనసు చేసెను ఊహల పయనం,
నా ఎదను తడిపెను చిరుజల్లు,
వినిలాకాశాన్నా విరిసెను హరివిల్లు,
నా నయనాలు చూసేను అద్బుత దృశ్యం,
నా కరముల రాసేను సుందర కావ్యం,
నా హృదయంత్రాలలో ఉద్భవించిన గీతికా,
నా స్వప్నన్నా ఆవిర్భవించిన ప్రణవగీతికా

Related