మనం శివరాత్రి, మాస శివరాత్రి, మహా శివరాత్రి అనే పదాల గురించి తెలుసుకుందాం. ముందుగా శివరాత్రి అనగా శివుడు జనమించిన రోజు అని అర్థం. శివుడు జన్మించిన పక్షం + తిధి ఆధారంగా ప్రతి మాసంలో ఆ పక్షంలోని తిథిని మాస శివరాత్రి అంటారు. అదే విధంగా మాసం + పక్షం + తిధి ఆధారంగా ప్రతి సంవత్సరానికి గల ఒక రోజును మహా శివరాత్రి అంటారు.

చాంద్రమానం ప్రకారం ప్రతి సంవత్సరంలో 12 మాసాలకు ఒక్కో మాసానికి, ఆ మాసంలోని కృష్ణ/బహుళ పక్ష చతుర్దశి రోజును మాస శివరాత్రి అంటారు. ఈ 12 మాస శివ రాత్రులలో మాఘ మాసంలో కృష్ణ/బహుళ పక్షం చతుర్దశిన వచ్ఛే రోజును మహా శివరాత్రి అంటారు.

ఈ రోజు శివ పార్వతుల వివాహం జరిగింది. శివ పురాణం ప్రకారం ఇదే రోజున లింగాకారంలో ఆవిర్భవించాడని చెప్పడం జరిగింది. అందువల్ల ఈ రోజును హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు.

లింగావిర్భావం

ఒక ప్రళయకాలం అనంతరం,బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్లగా అక్కడ శేషశయ్యపై విశ్రమిస్తున్న విష్ణువును చూసి గర్వంతో మాట్లాడటం వల్ల, హంస వాహనుడై బ్రహ్మ, గరుడ వాహనుడైన విష్ణువుతో యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో బ్రహ్మ పాశుపతాస్త్రం, విష్ణువు మాహేశ్వరాస్త్రం ప్రయోగించగా, ఆ యుద్ధాన్ని వీక్షిస్తున్న సకల దేవతలు భయంతో శివునికి మొర పెట్టుకుంటారు . అప్పుడు శివుడు అగ్ని స్తంభం రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకుంటాడు. దానికి ఆశ్చర్యచకితులైన బ్రహ్మ విష్ణువులు, ఆ అగ్ని లింగ రూపం ఆది అంతాలను తెలుసుకోడానికి , విష్ణువు వరాహ రూపంలో కిందకి, బ్రహ్మ హంస రూపంలో పైకి బయలుదేరుతారు. విష్ణువు ఎంత వెళుతున్న అంతం కనుక్కోలేక వెనుతిరుగుతాడు . బ్రహ్మకు మార్గ మధ్యలో కిందకు దిగుతున్న కామధేనువు, మొగలి పువ్వు (బ్రహ్మ విష్ణు యుద్ధం చూసిన నవ్వినప్పుడు, శివుని జటాజూటం నుంచి జారినది) కనిపించగా, వాటితో బ్రహ్మ తాను ఆదిని చూశానని విష్ణువుతో అసత్యం చెప్పండని ఒప్పందం చేసుకుంటారు . అప్పుడు మొగలి పువ్వు బ్రహ్మ ఆది చూసారని అసత్యం చెబుతుంది. కామధేనువు నిజమేనని తల ఊపి , తోకను అడ్డంగా ఊపుతుంది . దాంతో విష్ణువు బ్రహ్మకు పూజ చేస్తారు.

దాంతో విష్ణువుని చూసి సంతోషించి విష్ణువుకి తనతో సమానమైన పూజలు అందుకుంటాడని వరం ఇస్తాడు. అసత్యం చెప్పిన బ్రహ్మను శిక్షించమని , తన కను బొమ్మల మధ్యనుంచి , భైరవుడిని సృష్టించిగా , అసత్యం చెప్పిన పంచ ముఖ బ్రహ్మ లోని ఒక తలను వధిస్తాడు.

అబద్ధం చెప్పిన మొగలి పువ్వుకు పూజార్హం కాదు అని శపిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడిని చూచిన నాకు అసత్య దోషం తాకునా అని స్తుతించగా, సంతోషించి శివుడు, నీకు పూజార్హం లేకపోయినా, నిన్ను నా భక్తులు ధరిస్తారు అని వరం ఇస్తారు. అలాగే కామధేనువుకి పూజలు ఉండవని శపిస్తాడు . అప్పుడు తోకతో నిజం చెప్పానని ప్రార్థించగా , అప్పుడు శివుడు శాంతించి , అబద్ధం చెప్పిన నీ మొఖ భాగం పూజనీయం కాదు కానీ వెనుక భాగం పవిత్రమగును అని వరం ఇచ్చెను

విశేషాలు

  • ప్రజలు రోజంతా భక్తితో ఉపవాసం ఉంటారు.
  • మారేడు (బిల్వ) దళములతో శివుడిని అర్చిస్తారు.
  • ప్రజలు భక్తితో శివ పంచాక్షరీ మంత్రాన్ని మనసులో ధ్యానిస్తారు.
  • రాత్రి జాగారం చేస్తూ శివుని కథలను చెప్పుకుంటూ శివుని భక్తితో స్తుతిస్తారు.

Search

Books

Related