కనుమ, మకర సక్రాంతికి మరుసటి రోజు. దీనిని పశువుల పండుగ అని కూడా అంటారు.
ఇవ్వాళ రైతులు తమ వ్యవసాయానికి సాయం చేసే పశువులను పూజిస్తారు. పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరిస్తారు. పశువుల శాలను శుభ్రంగా అలంకరిస్తారు. అక్కడ పాలు, కొత్త బియ్యం, పసుపు, కుంకుమతో పొంగలి చేసి దేవునికి నైవేద్యం పెట్టి, పొలంలో చల్లుతారు. దీనినే పోలి చల్లడం అంటారు. గుమ్మడి కాయతో దిష్టి తీసి పగలకొడుతారు. ఇలా చేస్తే చీడ-పీడలు తగలకుండా దేవతలు కాపాడుతారు అని నమ్మకం.
ఇవ్వాళ పండుగకు వచ్చిన కొత్త అల్లుళ్లు తిరుగు ప్రయాణం చేయరు. కనుమ రోజు కాకి కూడా కదలదు అని సామెత కలదు. ఇవ్వాళ ముఖ్యంగా గారెలు, మాంసాహారాన్ని భుజిస్తారు.

Search

Books

Related