వ్యుత్పత్యర్థాలు

పదము వ్యుత్పత్త్యర్థాలు
అతిథి తిధి నియములు లేకుండ వచ్చేవాడు
అక్షతలు (అమక్షితలు) క్షతము లేనివి
అమృతం (సుధ) మరణం పొందింపనిది
అహిమ భానుడు (సూర్యుడు) చల్లనివి కాని కిరణములు గలవాడు
ఆరామం (ఉపవనము) ఇందులో క్రీడిస్తారు
ఈశ్వరుడు (శివుడు) ఐశ్వర్యము ఉన్నవాడు
కపి (కోతి) చలించేది
కరి (ఏనుగు) కరము (తొండము) కలది
కవి చాతుర్యంగా వర్ణించేవాడు
కార్ముకం (విల్లు) యుద్ధ కర్మ కొరకు సమర్థమైనది
గురువు (ఉపాధ్యాయుడు) అజ్ఞానమనెడి అంధకారమును పోగొట్టువాడు
చిత్రగ్రీవం (పావురం) చిత్రమైన వర్ణాలతో కంఠం కలది
చైత్యం (బౌద్ధ స్థూపం) పాషాణాదులచే కట్టబడింది
ఝరి (ప్రవాహం) కాలక్రమేణా స్వల్పమవునది
తరంగము (అల) దరి చేరినది
దరాధరము (పర్వతం) భూమిని ధరించునది
దానవులు (రాక్షసులు) దనువు అనే స్త్రీ వల్ల పుట్టినవారు
దాశరధీ (శ్రీ రాముడు) దశరధుని యొక్క కుమారుడు
దేహి (మనిషి) దేహాన్ని ధరించినవాడు
ధరణి (భూమి) విశ్వమును ధరించేది
పన్నగము (పాము) పాదములచే పోవునది
పయోధి (సముద్రం) నీటికి ఆధారమైనది
పయోనిధి (సముద్రం) దీనియందు నీరు నిలిచియుండును
పయోనిధి (సముద్రము) ఉదకములను ధరించునది
పతివ్రత (సాద్వి) పతిని సేవించుటయే వ్రతంగా కలిగినది
పంచజనుడు (మనిషి) ఐదు భూతములచే పుట్టబడే వాడు
పవనాశనులు (సర్పములు) గాలి ఆహారముగా కలవి
ప్రభంజనుడు (వాయువు) వృక్ష శాఖాదులను విరగ్గొట్టే వాడు
పారశర్యుడు (వ్యాసుడు) పరాశర మహర్షి యొక్క కుమారుడు
పార్వతి (గౌరి) పర్వతము యొక్క పుత్రిక
పారావారము (సముద్రం) అపారమైన తీరము గలది
పుత్రుడు (కుమారుడు) పున్నామ నరకం నుండి రక్షించువాడు
పురంధ్రి (గృహిణి) గృహమును ధరించునది
బుధుడు (పండితుడు) అన్నింటిని ఎరిగినవాడు
భవాని (పార్వతి) భవుని (శివుని) భార్య
భాస్కరుడు (సూర్యుడు) కాంతిని కలుగ జేయువాడు
ముక్కంటి (శివుడు) మూడు కన్నులు కలవాడు
ముని (ఋషి) మౌనము దాల్చి యుండువాడు
మూషికం (ఎలుక, పందికొక్కు) అన్నాదులను దొంగిలించునది
మోక్షం (ముక్తి) జీవుడిని పాశము నుండి విడిపించునది
రజనీకరుడు (చంద్రుడు) రాత్రిని కలుగచేసేవాడు
రజనీశ్వరుడు (చంద్రుడు) రాత్రులకు ప్రభువు
వజ్రము అడ్డము లేక పోవునట్టిది
వనజం (పద్మము) వనము (నీరు) నందు పుట్టినది
వనజనేత్ర (స్త్రీ) పద్మముల వంటి కన్నులు కలది
వనజాతము (పద్మము) నీటి నుండి పుట్టునది
వ్యాసుడు (వ్యాస మహర్షి) వేదములను విభజించి ఇచ్చినవాడు
విద్యార్థులు (శిష్యులు) విద్యను కోరి వచ్చేవారు
విశ్వనాధుడు (ఈశ్వరుడు) విశ్వానికి ప్రభువు
శరీరము (దేహము) రోగాదులచే హింసింపబడి శిధిలమయ్యేది
శివుడు (ఈశ్వరుడు) శుభాలను ఇచ్చువాడు
శ్రియఃపతి (విష్ణువు) లక్ష్మికి పతి
సన్యాసి సర్వమూ (న్యాసం చేసినవాడు) వదిలివేసినవాడు
సుగ్రీవుడు మంచి కంఠం కలవాడు
సాక్షి ఏదైనా ఒక కార్యాన్ని స్వయంగా చూసిన వాడు
సుధాకరుడు (చంద్రుడు) అమృత మయములైన కిరణాలు కలవాడు
స్నేహితుడు (మిత్రుడు) సర్వభూతముల యందు స్నేహయుక్తుడు
హరి (సూర్యుడు) చీకటిని హరించేవాడు
హరి (విష్ణువు) భక్తుల హృదయాలను ఆకర్షించే వాడు
హరి (సింహం) గజాదులను హరించునది
హార్మ్యము (మేడ) మనోహరముగా ఉండేది

Search

Books

Related