తెలుగు పర్యాయ పదాలు (Telugu Paryaya Padalu)

పర్యాయ పదం అనగా ఒక పదమునకు అదే అర్ధమునిచ్చు మరొక పదం. ఉదాహరణకు మనం అమ్మను తల్లి, మాత, జనని అని పలు రకాలుగా పిలుస్తాము. ఈ తల్లి, మాత, జనని అను పదాలను అమ్మ అనే పదానికి పర్యాయ పదాలు అంటారు.

నామవాచకము పర్యాయపదాలు
అమ్మ మాత, తల్లి, జననీ, జనయిత్రి
క్రియ పర్యాయపదాలు
అమ్మకం విక్రయం
విశేషణం పర్యాయపదాలు
ఆనందం సంతోషం, మోదము, హర్షము
క్రియా విశేషణం పర్యాయపదాలు
వేగంగా వడిగా, శీఘ్రంగా
పదం పర్యాయపదాలు
అగ్ని అనలం, నిప్పు, వహ్ని, జ్వలనము, దహనం, శుచి
అడుగు పాదం, చరణం
అనుమానము సందేహము, శంక, సంశయము
అమ్మ మాత, తల్లి, జననీ, జనయిత్రి
అమృతం పీయూషం, సుధ
ఆకారం ఆకృతి, రూపు
ఆకాశం గగనం, నింగి, రోదసి, అంబరము, నభము, మిన్ను
ఆగ్రహం కోపం, క్రోధం, అలుక, కినుక
ఆదేశం ఆజ్ఞ, ఆన, ఉత్తరువు, నిర్దేశం, ఆనతి
ఆనందం సంతోషం, మోదము, హర్షము
ఆలస్యం జాగు, విలంబం
ఆశ్చర్యం వింత, విచిత్రము, విడ్డూరం
ఇల్లు గృహము, భవనము, నిలయం, సదనము
ఈశ్వరుడు శివుడు, శంకరుడు, శంభువు, ముక్కంటి
ఏనుగు గజము, హస్తి, కరి, వారణము, దంతి
ఓర్పు తాల్మి, సహనము, ఓరిమి
కన్నీరు అశ్రువు, బాష్పమ
కావ్యం కృతి, గ్రంధము
కన్ను అక్షి, చక్షువు, నేత్రము, నయనము, లోచనం, పక్షి
కరుణ దయ, కృప, కనికరము
కాంతి వెలుగు, తేజస్సు
కామధేనువు సురభి, తెల్లమొదవు
కాలం సమయము, పొద్దు, తరుణము
కీర్తి యశస్సు, ఖ్యాతి, పేరు
కొండ అద్రి, పర్వతం, గిరి, శిఖరం
గంధము చందనము, మలయజము, గంధసారము
గాలి పవనం, సమీరం, వాయువు, మారుతం
గుర్రము అశ్వము, హయము, తురగము
గొంతు కంఠం, గ్రీవం, కుత్తుక
చంద్రుడు నిశాకరుడు, నెలవంక, ఇంద్రుడు, శశాంకుడు, సుధాకరుడు, శశి, శీతభానుడు, రజనీశ్వరుడు
చరిత్ర చరితము, ఇతివృత్తం
చాడ్పు రీతి, తీరు, విధం, భంగి, పగిడి
చింత దు:ఖం, శోకము
చీకటి తిమిరం, తమస్సుతమం, అంధకారం, ఇరులు, ధ్వాంతము
చెట్టు తరువు, వృక్షము, భూరుహము, భూజం, పాదపము
జ్ఞానం విజ్ఞానం , తెలివి, ఎఱుక, మేధ
జెండా పతాకము, కేతనము
తప్పు దోషము, దోసము, అపరాధము
తల శిరస్సు, మస్తకము
తలుపు ద్వారికవాటంబు, వాకిలి. ద్వారబంధము
తీపి మధురము, మాధుర్యం
తుమ్మెద భృంగము, షట్పదము
తెల్లకలువ కుముదము, ఇందీవరం, సృకము, కువలయం, కైరవం, ఉత్పలము
తేనె సుధ, మధువు
తోట వనము, ఉద్యానవనము
దయ జాలి, కరుణ, కృప
దిక్కు ఆశ, దిశ, దెస
దేవతలు అమరులు, వేల్పులు
ధనము అర్థము, ద్రవ్యము, విత్తము
నవ్వు స్మితం, హాసం
నక్షత్రాలు చుక్కలు, తారలు
నాట్యం నృత్యం, తాండవం, నర్తనం
నాన్న జనకుడు, అయ్య, పీత, నాయన, తండ్రి
నిజము నిక్కము, యదార్ధము, సత్యము, వాస్తవము, సత్యం
నిప్పు అగ్ని, జ్వలనము, వహ్ని, చిచ్చు
నీరు జనం, ఉదకం, సలిసము, తోయము, నీరము
నెయ్యి అమృతం, ఘృతం, ఆజ్యం
పట్టణము నగరము, పురము, బస్తీ, నగరి, ప్రోలు
పద్ధతి విధము, విధానము, రీతి, తీరు, చందము, త్రోవ
పల్లె ఊరు, గ్రామం, జనపదం
పక్షి ఖగము, విహంగము, పిట్ట, పులుగు
ప్రపంచం లోకం, జగత్తు, విశ్వం, జగము
పాము పన్నగము, అహి, ఉరగం
పాలు క్షీరము, దుగ్ధము, పయస్సు
పావురము కపోతము, పావురాయి, పారావతము
పుస్తకము గ్రంధం, పొత్తము, కితాబు
పుణ్యము కుశలము, ధర్మము, శ్రేయము
పువ్వు పుష్పము, ప్రసూనము, కుసుమము, విరి, సుమము
పెండ్లి వివాహం, పరిణయం, కళ్యాణం, పాణిగ్రహణం
ప్రేమ ఆప్యాయత, అనురాగం, వాత్సల్యం
పొట్ట కడుపు, కుక్షి, ఉదరం
బహుమతి కానుక, బహుమానము, కానిక
బ్రహ్మ పద్మభవుడు, చతుర్ముఖుడు
బంగారము పసిడి, సువర్ణము, కనకము, హేమము, స్వర్ణము, కాంచనం
బ్రాహ్మణుడు విపుడు, ద్విజుడు, భూసురుడు
భాగీరథి గంగానది, జాహ్నవి, పావని
భూమి ధరణి, పుడమి, నేల, అవని, పృధ్వి
మంచు తుషారం, నీహారం
మనిషి మానవుడు, నరుడు, మర్త్యుడు, మనుజుడు
మరణం మృత్యువు, నిర్యాణం, చావు
ముఖము వదనము, ఆననము, మొగము
ముత్యము మౌక్తికము, ముక్తాఫలము
ముద్ర చిహ్నం, గుర్తు
మూర్ఖుడు ముష్కరుడు, దుష్టుడు, ఖలుడు, దుర్జనుడు
యవనిక తెర, పరదా
రథం తేరు, శతాంగము
రంగు వర్ణము, ఛాయ
రాజు ప్రభువు, భూపాలుడు, నరపాలుడు, భూపతి
రాత్రి రజని, రేయి, యామిని, నిశ
రోగం వ్యాధి, జబ్బు, రుగ్మత, తెగులు, అస్వస్థత
లక్ష్మి ఇందిరా, రమ, సిరి, శ్రీ, కమల
లేఖ ఉత్తరం, జాబు
వ్యాసుడు పారాశర్యుడు, బాదరాయణుడు, వేదవ్యాసుడు, సాత్యవతేయుడు
వెన్నెల కౌముది, జ్యోత్స్న, చంద్రిక
వెల్లి ప్రవాహం , సరిత, నది, ఏరు, ధార
వేగం వడి, శీఘ్రం, రయం
సన్యాసి బిక్షువు, ముని, యతి, మౌని
సముద్రం కడలి, అంబుధి, ఉదధి
స్మరణ తలపు, ఆలోచన, బుద్ధి
స్త్రీ మగువ, కొమ్మ, ఇంతి, పడతి, వనిత, కాంత, మహిళ, ఉవిద, యువతి, పురంధ్రి, అంగన, నారి
సూర్యుడు ఆదిత్యుడు, భాస్కరుడు, దినకరుడు, రవి, ఇనుడు, అహిమకరుడు, భానుడు, పతంగుడు
స్నేహం మైత్రి, చెలిమి, సాంగత్యం
స్నేహితుడు మిత్రుడు, చెలికాడు, దోస్తు, నేస్తము
సంకేతం గుర్తు, చిహ్నం
సముద్రం కడలి, సాగరం, జలధి, పయోనిధి, సాగరం
సమూహం గుంపు, రాశి, సముదాయం
స్మరణ జ్ఞప్తి, స్మృతి, తలపు, యాది
స్వర్గం దివి, అమరలోకం
శరీరము తనువు, దేహము, మేను, కాయము
శ్రీ రాముడు దాశరథి, రాఘవుడు, రామభద్రుడు
హరివిల్లు ఇంద్రధనుస్సు, ఇంద్రచాపము, దేవాయుధము

Search

Books

Related