ముందుగా మన తెలుగు జాతికి వందనం. తెలుగును పరిరక్షించే తెలుగు భాషాభిమానులకు, భాష కీర్తి ప్రఖ్యాతలు ఖండాంతరాలకు తమ కవితలు, రచనల ద్వారా ఇనుమడింప చేసే కవి, రచయితల సమూహానికి అభినందనలు తెలియజేస్తున్నాము. మన ముందు తరాల మాదిరి మనము, రాబోయే తరాలు మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తామని, మాతృభాషను పరిరక్షించే మనందరి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తామని ఆశిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను.
మన పాఠక ప్రేక్షకులకు తెలుగు లిఖిత జ్ఞానం, వ్యాకరణం, సాంస్కృతిక, ప్రాపంచిక, ఆధ్యాత్మిక విషయములు ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే విధంగా మాతృభాషలో అందించాలనే సదుద్దేశంతో ఈ క్రింది విషయాలను క్రోడీకరించి, ఈ జ్ఞాన సంపుటిని పెద్దబాలశిక్ష గా అభివర్ణిస్తూ మీకు అందజేయడం జరిగింది.
ఈ సమాచారాన్ని మీ తోటి మిత్రులకు, కుటుంబ సభ్యులకు మరియు చిన్నారులకు తెలియజేయాలని కోరుతున్నాము. ఈ విధంగా మీ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, మా ఈ చిరు ప్రయత్నానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని మనవి.
జై తెలుగుతల్లి ! జై జై భారతమాత !!