తాజాగా వాట్సాప్ తన ప్రైవసీ పాలసీ లను విడుదల విడుదల చేసింది. ఇవి కొంత అనుమానాస్పదంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కొత్త నియమాలను ఫిబ్రవరి 8 వ తేదీ లోపు అంగీకరించకపోతే, అకౌంట్ డిలీట్ అవుతుందని కూడా తెలిపింది. దీంతో ప్రైవసీ కి ప్రాముఖ్యత ఇచ్ఛే వినియోగదారులు, ఈ పాలసీలు వ్యక్తిగత ప్రైవసీ కి భంగం వాటిల్లుతుందని, ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంలో వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా వేరే అప్లికేషన్స్ కోసం వెతుకుతున్నారు.
మీరు కూడా ఈ కొత్త పాలసీలను గురించి ఈ క్రింద తెలుపబడిన లింక్ లో చూడండి. మన వ్యక్తిగత విషయాలను ఎంత వరకు సేకరిస్తుంది, దాని వల్ల ఉన్న ప్రమాదం గురించి ఒకసారి ఆలోచించండి.
WhatsApp terms
ఈ నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు) "Use Signal" అనే ఒకే ఒక ట్వీట్ చేశారు. దీంతో ఒక్క సారిగా సిగ్నల్ యాప్ డౌన్లోడ్స్ పెరిగిపోయాయి.
ఈ యాప్ ను మొదటగా 2014 లో విడుదల చేశారు. ఇది వాట్సాప్ తరహాలోనే ఉంటుంది. ట్విట్టర్ లో సిగ్నల్ యొక్క ట్యాగ్ లైన్ 'సే హలో టు ప్రైవసీ', అంటే ప్రైవసీకి అధిక ప్రాముఖ్యత ఇస్తుందని అర్థం అవుతుంది. ఇందులో షేర్ చేసుకునే సమాచారం ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్ట్ చేయబడుతుంది. అంతే కాకుండా మీ సమాచారం మొత్తం మీ మొబైల్ లోనే ఉంటుంది. మీరు రీ-ఇన్స్టాల్ చేస్తే, మీ మొబైల్ లో ఉన్న బ్యాకప్ ఫైల్ ను వినియోగించవచ్చు.
ఈ యాంత్రిక యుగంలో ప్రైవసీ కి గండి పడుతున్న నేపథ్యంలో చింతిస్తూ, మా పాఠకులకు సిగ్నల్ యాప్ ను వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా సూచిస్తున్నాం. యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి అనుకునే వారు ఈ క్రింది లింక్ ను వినియోగించండి.
ప్లే స్టోర్ లింక్: సిగ్నల్ యాప్