ట్విట్టర్ ! ఇందులో ఏముంది, ఏమంత ప్రత్యేకత ?

ట్విట్టర్ ఇదొక సోషల్ మీడియా ప్రపంచం. జూలై 2006 లో ఊపిరి పోసుకున్న ట్విట్టర్ కాలానుగుణంగా ఎన్నో కొత్త రంగులను పులుముకుని యూజర్స్ తో హోలీ ఆడుకుంది. ఇది సింగిల్ పేజ్ అప్లికేషన్, అనగా మనం పేజ్ ని రిఫ్రెష్ కొట్టకుండానే ఇన్ఫర్మేషన్ ని పుష్ చేస్తుంది, అనగా కొత్త ట్వీట్స్ దాని లైక్స్ కౌంట్, రిట్వీట్ కౌంట్, నోటిఫికేషన్స్ లేదా మెసేజెస్ కౌంట్ ఇలా.


ముందుగా ఇందులో రిజిస్టర్ అయ్యి అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. మీ యూజర్ నేమ్ ని క్రియేట్ చేసుకోవాలి. తద్వారా మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఈజీ గా ఐడెంటిఫై చేయడానికి, వారి ట్వీట్స్ లో మిమ్మల్ని మెన్షన్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మీ కిష్టమైన వారిని సెర్చ్ ఆప్షన్ ద్వారా వెతికి ఫాలో అవ్వండి. వాళ్ళు చేసే ట్వీట్స్ ని హోమ్ పేజీలో చూడొచ్చు. ఇది 2000 లో ప్రారంభమైనా ఇంకా దీని గురించి చాలా మందికి తెలీదనే చెప్పాలి. తెలిసినా దీని అసలు రుచి తేలీదనే చెప్పొచ్చు.


ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇందులో 280 యూనికోడ్ అక్షరాలు తో ట్వీట్స్ చేయొచ్చు. 4 ఇమేజెస్/వీడియోస్ వరకూ అప్లోడ్ చేయొచ్చు. అవతల వారి ట్వీట్స్ ని లైక్ లేదా రీ ట్వీట్ చేయొచ్చు. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు. 2020 లో ఫ్లీట్ అనే ఫీచర్ తో పాటు, ఐఫోన్ యూజర్స్ కి ఆడియో అప్లోడ్ ఆప్షన్ ని అందుబాటులోకి తెచ్చింది. త్వరలో ఆండ్రాయిడ్ యూజర్స్ కి కూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో ఉంది.


ఇది సెలబ్రిటీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా చేపొచ్చు. ఎందుకంటే దాదాపు ప్రపంచంలోని అందరు సెలబ్రిటీస్ ముఖ్యమైన విషయాలను ట్విట్టర్ వేదికగా తమ ఫోలవర్స్ తో షేర్ చేసుకుంటారు. ఇందులో బోట్స్ అకౌంట్స్ చాలానే ఉంటాయి. అనగా రోబోట్స్ యాస్ యూజర్స్ అన్నమాట. దీన్ని నెగటివ్ గా చెప్పుకోవచ్చు.


ఇంకెందుకు ఆలస్యం ! ఇప్పుడే https://twitter.com ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుని మీరు ట్విట్టర్ ప్రపంచంలోకి అడుగు పెట్టండి. ముందుగానే అకౌంట్ ఉన్నట్లయితే అభినందనలు. ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే మరియు మా తదుపరి అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందాలంటే దయచేసి https://twitter.com/OmniGuruIndia ఫాలో అవ్వండి.


Books

Related