నడవవోయ్ ముందుకు ! నడవవోయ్ ముందుకు !!

పట్టువదలకా,
ప్రయత్నం విడువకా,
ధూర్తలోకంపై గెలిచెదాకా,
ఈ చెడు లోకం మారేదాకా,
నడవవోయ్ ముందుకు ! నడవవోయ్ ముందుకు !!

రక్తం కారిన,
ఆశలు ఎండిన,
అయిన నిరాశపడక,
ఆయాసపడక,
నిన్ను చూసి అందరూ ఏడ్చేదాక, చప్పట్లుకొట్టేదాకా,,
నడవవోయ్ ముందుకు ! నడవవోయ్ ముందుకు !!

వాగులు, వంకలు,
కొండలు, బండలు,
చెట్టుచేమలు,
కరిచే పాములు,
కుట్టే చీమలు,
అడ్డువచ్చిన, ఎదురువచ్చిన,,
నడవవోయ్ ముందుకు ! నడవవోయ్ ముందుకు !!

కాల్చుకుతినే మృగలెన్నో,
ప్రతిసారి మోరిగే కుక్కలెన్నో,
క్రుంగదీసే భాధలెన్నో,
కృశింపజేసే వ్యాధులెన్నో,
అయిన కృంగిపోక, కృశించిపోక,,
నడవవోయ్ ముందుకు ! నడవవోయ్ ముందుకు !!

కష్టాలెన్నో వస్తేరాని,
సుఖలాన్ని పోతేపోనీ,
పేదరికం వస్తేరాని,
రాజరికం పోతేపోని,
వ్యాధులు, బాధలు వస్తేరాని,
మేడలు, మిద్దెలు పోతేపోని
ఓటములు, అపజయాలు వస్తేరాని,
గెలుపులు, విజయాలు పోతేపోని
నడవవోయ్ ముందుకు ! నడవవోయ్ ముందుకు !!

ఆకలి వేసిన,
భయం వేసిన,
జ్వరం కాసిన,
చీకటి మూసిరిన,
నడవవోయ్ ముందుకు ! నడవవోయ్ ముందుకు !!

నువ్వు పోతే ఏడ్చేవారెవ్వరు,
బ్రతికుంటే చూసేవారెవ్వరు,
నీ కన్నీరు తుడిచేవారెవ్వరు,
నువ్వు పడితే లేపేవారెవ్వరు,
నీతో కడదాకా వచ్చేవారెవ్వరు,
ఈ లోకంలో పత్తితులెవ్వరు ,
ఎవ్వరిని నమ్ముకోకు, ఎవ్వరికోసం ఆగిపోకు
నడవవోయ్ ముందుకు ! నడవవోయ్ ముందుకు !!

కష్టం నీదే,
నష్టం నీదే,
ఫలితం నీదే,
జీవితం నీదే,
కష్టాన్ని భరించు,
భయన్ని ఎదిరించు,
విజయాన్ని సాధించు,
చరిత్రని సృష్టించు,
నువ్వెంటో నిరూపించు,
నడవవోయ్ ముందుకు ! నడవవోయ్ ముందుకు !!

Related