ఛందస్సు అనగా పద్యం వ్రాయు విధానం. ఇందులో వృత్తాలు, జాతులు, ఉపజాతులు కలవు. పద్యలక్షణాలను అర్థం చేసుకోడానికి ముందుగా గురువు-లఘువులు, గణాలు-రకాలు అభ్యసించాలి.
గురువు - లఘువు
గురువును
U తోను, లఘువును
I తోనూ సూచిస్తారు. గురు లఘువులను అక్షరాన్ని పలికే సమయాన్ని బట్టి గుర్తిస్తారు. సాధారణంగా ఒక లిప్త కాలంలో పలికే అక్షరాన్ని లఘువు గాను, రెండు లిప్త కాలాలలో పలికే అక్షరాన్ని గురువు గాను చెప్పవచ్చు.
నియమాలు |
హ్రస్వాక్షరములు లఘువులు.
ఉదా: తల (II), ఇటుక(III). |
దీర్ఘాలన్ని గురువులు.
ఉదా: కాకి (UI), కీలు(UI), కూర (UI), కోతి (UI). |
ఐత్వము, ఔత్వము, సున్న, విసర్గ, పొల్లు తో ఉన్న అక్షరాలు గురువులు.
ఉదా: రైతు (UI), కౌలు (UI), అంబ (UI), నమః (IU), ఎగసెన్ (IIU) |
ద్విత్వ/సంయుక్త అక్షరం లఘువు గాను, దాని ముందున్న అక్షరం అదే పాదంలో ఉంటే గురువు, వేరే పాదంలో ఉంటే లఘువు అవుతుంది.
ఉదా: అన్నము (UII) |
ర ఒత్తు ఉన్న అక్షరానికి ముందున్న అక్షరము కొన్ని సార్లు లఘువు, మరి కొన్ని సార్లు గురువు అగును. |
ఋత్వము తో ఉన్న అక్షరాలు, దాని ముందున్న అక్షరాలు లఘువులు.
ఉదా: వికృతి (III) |
గణాలు - రకాలు
1. ఏకాక్షర గణములు (2)
2. రెండక్షరాల గణములు (4)
లల/లా |
లగ/వ |
గల/హ |
గగ/గా |
II |
IU |
UI |
UU |
3. మూడక్షరాల గణములు (8)
న |
స |
జ |
య |
భ |
ర |
త |
మ |
III |
IIU |
IUI |
IUU |
UII |
UIU |
UUI |
UUU |
4. ఉప గణములు
4.A. సూర్య గణములు (2)
4.B. ఇంద్ర గణములు (6)
నగ |
సల |
నల |
భ |
ర |
త |
IIIU |
IIUI |
IIII |
UII |
UIU |
UUI |
4.C. చంద్ర గణములు (14)
భల |
భగరు |
తల |
తగ |
మలఘ |
నలల |
నగగ |
నవ |
సహ |
సవ |
సగగ |
నహ |
రగురు |
నల |
UIII |
UIIU |
UUII |
UUIU |
UUUI |
IIIII |
IIIUU |
IIIIU |
IIUI |
IIUIU |
IIUUU |
IIIUI |
UIUU |
IIII |
యతిమైత్రి:
పాదం మొదటి అక్షరంతో యతిస్థానంలో ఉండే అక్షరం యతిమైత్రి వర్గంలో ఉండాలి. వర్గాలు: (అ, ఆ, ఐ, ఔ, హ, య, అం, అః), (ఇ, ఈ, ఎ, ఏ, ఋ), (ఉ, ఊ, ఒ, ఓ), (క, ఖ, గ, ఘ, క్ష), (చ, ఛ, జ, ఝ, శ, ష, స), (ట, ఠ, డ, ఢ), (త, థ, ద, ధ), (ప, ఫ, బ, భ, వ), (ణ, న), (ర, ఱ, ల, ళ), (పు, ఫు, బు, భు, ము, పొ, ఫొ, బొ, భొ, మొ).
ప్రాసమైత్రి:
పద్యంలో ప్రతి పాదంలో రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. ప్రతి పాదంలో రెండవ అక్షరం అదే అక్షరం లేదా అదే వర్గానికి చెందిన అక్షరం అయి ఉండాలి. వర్గాలు: (ద, ధ), (ధ, థ), (ఱ, ర), (న, ణ), (ల, ళ).
పద్యాలు - లక్షణాలు
1. వృత్తములు
యతిప్రాసలు, మూడక్షరాల గణాలు, నాలుగు పాదాలు ఉండును.
వృత్తము |
గణాలు |
పాదాలు |
అక్షరాలు |
యతిస్థానం |
ఉత్పలమాల |
భ, ర, న, భ, భ, ర, వ |
4 |
20 |
10 |
చంపకమాల |
న, జ, భ, జ, జ, జ, ర |
4 |
21 |
11 |
శార్దూలము |
మ, స, జ, స, త, త, గ |
4 |
19 |
13 |
మత్తేభము |
స, భ, ర, న, మ, య, వ |
4 |
20 |
14 |
గణవిభజన
పోతన భాగవతంలోని పద్యమును ఉదాహరణగా తీసుకుని గణ విభజన చేయడం జరిగింది.
భ |
ర |
న |
భ |
భ |
ర |
వ |
UII |
UIU |
III |
UII |
UII |
UIU |
IU |
పుణ్యుడు |
రామచం |
ద్రుడట |
వోయి ము |
దంబున |
గాంచె దం |
డకా |
రణ్యము |
దాపసో |
త్తమ శ |
రణ్యము |
నుద్దత |
బర్హిబ |
ర్హలా |
వణ్యము |
గౌతమీ |
విమల |
వాఃకణ |
పర్యట |
న ప్రభూ |
త సా |
ద్గుణ్యము |
నుల్ల స |
త్తరు ని |
కుంజ వ |
రేణ్యము |
నగ్రగ |
ణ్యమున్ |
2. జాతులు
యతిప్రాసలు, మాత్రగణాలతో ఉండును.
- కందం
- ద్విపద
- తరువోజ
- అక్కరలు
3. ఉపజాతులు
యతినియమం, సూర్య, ఇంద్ర గణాలు ఉండును.
- తేటగీతి
- ఆటవెలది
- సీసము