భోగి (భోగం) అనగా అన్నింటినీ అంగరంవైభవంగా ఆనందించడం. ఈ పండుగ మకర సంక్రాంతికి ముందు రోజు కనుక, పట్నం నుంచి కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్లు, మనవళ్లు, మనవరాళ్లు తమ పెద్ద వారితో కలిసి పండుగలు జరుపుకునేందుకు తమ పల్లెటూళ్ళు చేరుకుంటారు.
ఆ రోజు 4 గంటలకు ముందే లేచి పనికి రాని పాత సామాను, ఎండు పుల్లలు, తడికెలు అన్ని ఒక దగర పేర్చి, భోగి మంటలు వేసి చలి కాచుకుంటారు. దీనివల్ల, పురుగు బుట్ర నశిస్తాయని, ఒక రకమైన వైరాగ్య భావన కలుగుతుందని నమ్మకం. భోగి మంట చల్లారాక, నిప్పు కలికల్లోనే నీరు కాచుకుని, తలకు నువ్వుల నూనెతో బాగా మర్ధన చేసుకుని, కుంకుడుకాయలతో అభ్యంగస్నానం చేసి, సాంబ్రాణి పొగతో ఆరబెట్టుకుంటారు.
ఇవ్వాళ సూర్యారాధన చేస్తారు. పెరంటాల్లను పిలిచి తమ పిల్లలను పీట మీద కూర్చోబెట్టి భోగి పళ్ళతో (లేదా కొత్త బియ్యం, కుడుములు) తల చుట్టూ మూడు సార్లు తిప్పి, తల మీద పోస్తారు. ఇలా చేస్తే పిల్లలకు దృష్టి దోషం పోతుందని విశ్వసిస్తారు. చివరలో పెరంటాల్లకు, ఆకు వక్కలతో వాయనం ఇస్తారు.
ఈ సమయానికి రైతులకు పంట చేతికి వచ్చి దానిని అమ్ముకుని పుష్కలంగా దన ధాన్య రాశులతో సంతోషంగా ఉంటారు.

Search

Books

Related