స్వాతంత్ర్య దినోత్సవం

మన భారత దేశం కొన్ని వందల యేళ్లు పాశ్చాత్య దేశాల బానిసత్వంలో బలి అయ్యింది. ఆఖరుకు అనేక మంది విప్లవ వీరుల పోరాటాల వల్ల మనకు స్వాతంత్య్రం లభించింది. అప్పటి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్ 1947 సంవత్సరంలో ఆగస్టు 14 న అర్థ రాత్రిన భారత దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించారు. అందువల్ల ఆగస్టు 15న ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుటున్నాం.



వివరాలు


ప్రతి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా, భారత ప్రధాని ఢిల్లీ లోని ఎర్రకోటపై మన జాతీయ జెండాను ఎగురవేస్తారు.


భారత అప్పటి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్ భారత దేశానికి ఆగస్టు 15 న ఇవ్వాలని నిర్ణయించారు. ఈ తేదీని జపాన్ తన మిత్ర దేశాలకు లొంగిపోయిన (1945 ఆగస్టు) రెండేళ్ల సందర్భంగా పరిగణలోకి తీసుకున్నారు.


భారత దేశంతో పాటు ఆగస్టు మరో మూడు దేశాలు కూడా స్వతంత్ర దినోత్సవాన్ని ఆగస్టు 15 న జరుపుకుంటాయి. దక్షిణకొరియాకు జపాన్ నుంచి 1945 లో. బహరీన్‌కు బ్రిటన్ నుంచి 1971 లో, కాంగోకు ఫ్రాన్స్ నుంచి 1960 లో స్వాతంత్ర్యం లభించింది.


భారత జాతీయ జెండాను మన తెలుగు వారైన పింగళి వెంకయ్య రూపొందించారు. జాతీయ జెండాలో కాషాయం త్యాగానికి, తెలుపు శాంతికి, పచ్చ శ్రేయస్సుకు మరియు 24 దళాలతో కూడిన నీలపు అశోక చక్రం ధర్మ నియమాలకు ప్రతీకలు.


ప్రఖ్యాత రచయిత నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన గీతాన్ని 1911లో రచించారు. మనకు 1947లో స్వాతంత్ర్యం వచ్చినా కానీ జనగణమణ 1950లో జాతీయగీతంగా గుర్తింపు పొందింది. వాస్తవానికి ఈ గీతాన్ని బ్రిటిష్ కింగ్ ఐదో జార్జ్ 1911లో భారత్ వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధం చేశారు.


జాతీయ గేయం గుర్తింపు పొందిన 'వందేమాతరం'ను బంకించంద్ర ఛటర్జీ రచించారు. నిజానికి వందేమాతరం చటర్జీ 'ఆనంద్మఠ్' నవలలోని మొదటి రెండు చరణాలు. ఆర్మీ బ్యాండ్లో వాయించడానికి వందేమాతరం కన్నా జనగణమణ అయితే సులభంగా ఉంటుందని మన మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రతిపాదించారు అని అంటారు.


భారత్ మరియు పాకిస్తాన్ సరిహద్దు రేఖను రాడ్ క్లిఫ్ 1947 ఆగస్టు 17 న నిర్ణయించారు. దీనినే రాడ్ క్లిఫ్ లైన్ గా పిలుస్తారు.



విప్లవాలు


సిపాయిల తిరుగుబాటు (1857)


బ్రిటిష్ వారి కింద బానిసత్వానికి బలైన భారతీయులు, వారికి వైతిరేకంగా 1857లో మంగళ్ పాండే గారి నాయకత్వములో సిపాయిల ఉద్యమం జరిగింది. ఇందులో ఓటమి తర్వాత 1858 లో బ్రిటీషు రాణి భారత దేశాన్ని పాలించింది.



సమరయోధులు


సుభాష్ చంద్రబోస్


గాంధీజీ


మన జాతిపిత గా వెలుగొందిన గాంధీజీ, తన ప్రసంగాల ద్వారా ప్రజలను చైతన్య పరచి, శాంతియుతంగా అనేక ఉద్యమాలను నడిపించారు. ఉప్పు సత్యాగ్రహం, అనేక నిరాహార దీక్షలు, హిందూ ముస్లింల మధ్య సఖ్యత కు పోరాటాలు ఇలా ఎన్నో చేశారు.


భగత్ సింగ్


' విప్లవం వర్ధిల్లాలి ' అనే నినాదంతో భారతీయులకి కసి రగిలించిన విప్లకారుడు. అతి పిన్న వయసులోనే స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను అర్పించిన సమర యోధుడు.


అల్లూరి సీతారామరాజు


Search

Books

Related