ఏకవాచకాలు |
ఏకదంతుడు |
వినాయకుడు |
ద్వివాచకాలు |
ద్వివిదాత్మలు |
జీవాత్మ, పరమాత్మ |
ద్వివిధకావ్యములు |
దృశ్య, శ్రవ్య కావ్యములు |
త్రివాచకాలు |
త్రికరణములు |
మనస్సు, వాక్కు, కాయము |
త్రికాలములు |
భూత, భవిష్యత్తు, వర్తమానం |
త్రిగుణములు |
సత్వ, రజో, తమో |
త్రిమూర్తులు |
బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు (శివుడు) |
చతుర్వాచకాలు |
చతురాశ్రమములు |
బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము |
చతుర్విధ కర్మలు |
ధ్యానము, శౌచము, భిక్ష, ఏకాంతం |
చతుర్విధ బలములు |
రధములు, గణములు, తురగములు, పదాతులు |
చతుర్విధ స్త్రీ జాతులు |
పద్మినీ, హస్తినీ, శంఖినీ, చిత్తనీ |
చతుర్విధోపాయములు |
సామము, దానము, బేధము, దండము |
చతుర్యుగాలు |
కృత, త్రేతా, ద్వాపర, కలి |
చతుర్వేదాలు |
ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము |
పురుషార్థచతుష్టయం |
ధర్మము, అర్థము, కామము, మోక్షము |
పంచవాచకాలు |
అయిదవతనం |
మంగళసూత్రం, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు |
పంచపాండవులు |
ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు |
పంచ మహాపాతకాలు |
స్త్రీ హత్య, శిశు హత్య, గో హత్య, బ్రహ్మ హత్య, గురు హత్య |
పంచభక్ష్యాలు |
భక్ష్యము (నమిలేది), భోజ్యము (చప్పరించేది), చోష్యము (పీల్చుకునేది/జుర్రుకునేది), లేహ్యము (నాకేది), పానీయము (త్రాగేది) |
పంచాంగం |
తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం |
పంచామృతాలు |
ఆవు పాలు, పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార |
పంచభూతములు |
అగ్ని, ఆకాశము, నీరు, భూమి, వాయువు |
పంచాక్షరి |
న, మ, శి, వా, య |
పంచగంగలు |
గంగ, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, కావేరి |
పంచ ప్రాణాలు |
ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము |
పంచతంత్రం |
మిత్రాలభము, మిత్రభేదము, అపరక్షితకరకం, లబ్ద ప్రణాసం, కాకొలుకీయం |
పంచలోహములు |
బంగారం, వెండి, ఇత్తడి, కంచు, ఇనుము |
పంచేంద్రియాలు |
కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, నాలుక, చర్మం |
షడ్వాచకాలు |
షడృతువులు |
వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు |
షడ్విధ రసములు |
ఉప్పు, పులుపు, కారం, తీపి, చేదు, వగరు |
అరిషడ్వర్గం |
కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం |
సప్తవాచకాలు |
సప్తఋషులు |
అత్రి, కశ్యపుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు, వశిష్టుడు, విశ్వామిత్రుడు |
సప్తచక్రాలు |
మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా, సహస్రార |
సప్తగిరులు |
శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి |
సప్తనదులు |
గంగ, యమున, సరస్వతి, గోదావరి, సింధు, నర్మద, కావేరి |
అష్టవాచకాలు |
అష్టజన్మలు |
దేవ, మనుష్య, రాక్షస, పిశాచ, పశు, పక్షి, జలజీవ, కీటక జన్మ |
అష్టలక్ష్ములు |
ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి |
అష్టదిక్కులు |
తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం |
అష్టదిక్పాలకులు |
ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు |
అష్టదిగ్గజ కవులు |
అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన లేక కందుకూరి రుద్రకవి, అయ్యలరాజు రామభధ్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు |
అష్టదిగ్గజాలు |
ఐరావతం, పుండరీకం, వామనం, కుముదం, అంజనం, పుష్పదంతం, సార్వభౌమం, సుప్రతీకం |
అష్టసిద్ధులు |
అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశీత్వం |
నవవాచకాలు |
నవగ్రహాలు |
సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు |
నవరంధ్రాలు |
2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు, నోరు, మలం, మూత్రం |
నవరత్నములు |
ముత్యము, రత్నం, వజ్రం, పగడం, కెంపు, మరకతము, నీలమణి, గోమేదికం, పుష్యరాగం |
నవరసాలు |
శృంగారం, వీరం, కరుణ, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం |
నవధాతువులు |
బంగారం, వెండి, ఇత్తడి, సీసం, రాగి, తగరం, ఇనుము, కంచు, కాంతలోహం |
నవధాన్యాలు |
అలసందలు, ఉలవలు, కందులు, గోధుమలు, పెసలు, నువ్వులు, మినుములు, యవలు (బార్లీ), శనగలు |
దశవాచకాలు |
దశావతారములు |
మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నృసింహావతారము, వామనావతారము, పరశురామావతారము, రామావతారము, కృష్ణావతారము, వెంకటేశ్వరావతారము, కల్క్యావతారము |
దశదానాలు |
గోదానం, భూదానం, తిలదానం (నువ్వులు), హిరణ్య (బంగారం), ఆజ్య (నెయ్యి), వస్త్రదానం, ధాన్యదానం, గుడ దానం (బెల్లం), లవణదానం (ఉప్పు), రజత దానం |
చతుర్దశవాచకాలు |
చతుర్దశ భువనాలు |
అతలం, వితలం, సుతలం, రసాతలం, మహతలం, తలాతలం, పాతాళం, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం |
|
|