తెలుగు సంధులు (Telugu Sandhulu with Examples)

సంధి అనగా రెండు పదముల కలయిక. ఉదా : అమ్మ + అమ్మ = అమ్మమ్మ
సంస్కృత సంధులు
1 సవర్ణదీర్ఘ సంధి భారత + అవని = భారతావని; కోటి + ఈశ్వరుడు = కోటీశ్వరుడు
2 గుణ సంధి దేవ + ఇంద్రుడు = దేవేంద్రుడు; భావ + ఉద్రేకం = భావోద్రేకం
3 వృద్ధి సంధి పరమ + ఔషధం = పరమౌషధం
4 యణాదేశ సంధి అతి + అంత = అత్యంత
5 జస్త్వ సంధి సత్ + భావం = సద్భావం
6 శ్చుత్వ సంధి విద్యుత్ + శక్తి = విద్యుచ్ఛక్తి
7 విసర్గ సంధి అయః + మయం = అయోమయం
8 అనునాసిక సంధి తత్ + మయం = తన్మయం; జగత్ + నాథుడు = జగన్నాథుడు
తెలుగు సంధులు
1 అకార/అత్వ సంధి రామ + అయ్య = రామయ్య
2 ఇకార/ఇత్వ సంధి ఏమి + అది = ఏమది
3 ఉకార/ఉత్వ సంధి ఇట్లు + అనియె = ఇట్లనియె
4 ఆమ్రేడిత సంధి పగలు + పగలు = పట్టపగలు; అక్కడ + అక్కడ = అక్కడక్కడ
5 యడాగమ సంధి మా + అమ్మ = మాయమ్మ
6 గసడదవాదేశ సంధి వారు + కదా = వారుగదా
7 సరళాదేశ సంధి
8 టుగాగమ సంధి తేనె + ఈగ = తేనెటీగ
9 రుగాగమ సంధి పేద + ఆలు = పేదరాలు
10 దుగాగమ సంధి నా + విభుడు = నాదువిభుడు
11 నుగాగమ సంధి కలుగు + అప్పుడు = కలుగునప్పుడు

Search

Books

Related