Recommended
రోజూ ఎక్కువ నీరు త్రాగడానికి ఉత్తమ మార్గాలురోజూ ఎక్కువ నీరు త్రాగడానికి ఉత్తమ మార్గాలుTHE MIND - An Invisible Friend & EnemyTHE MIND - An Invisible Friend & Enemyమహా శివరాత్రిమహా శివరాత్రిLCD, LED, OLED, AMOLED know more about display screen technologies LCD, LED, OLED, AMOLED know more about display screen technologies వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా సిగ్నల్ యాప్వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా సిగ్నల్ యాప్స్వప్నాన కురిసిన వానస్వప్నాన కురిసిన వానMy Bicycle Journey to HomeMy Bicycle Journey to Homeనడవవోయ్ ముందుకు ! నడవవోయ్ ముందుకు !!నడవవోయ్ ముందుకు ! నడవవోయ్ ముందుకు !!

ప్రకృతి వికృతి

అన్ని భాషలకు సంస్కృతం మూలమని మన పూర్వీకుల అభిప్రాయం. ఇండో-ఆర్యన్ భాషలలోని పదాలను ప్రకృతి పదాలుగా, ప్రకృతి పదాల నుంచి శబ్ద+వర్ణ రూపాంతరం చెందిన పదాలను వికృతి పదాలు అంటారు.
ప్రకృతి వికృతి
అంబ అమ్మ
అక్షరము అక్కరము
అగ్ని అగ్గి
అద్భుతము అబ్బురము
అపూర్వము అబ్బురము
అనాధ అనద
అమావాస్య అమవస
ఆకాశము ఆకసము
ఆధారము ఆదరువు
ఆశ ఆస
ఆశ్చర్యము అచ్చెరువు
ఆహారము ఓగిరము
ఆజ్ఞ ఆన
కథ కత
కన్య కన్నె
కవి కయి
కార్యము కర్జము
కుంతి గొంతి
కుమారుడు కొమరుడు
కుఠారము గొడ్డలి
కుడ్యము గోడ
కులము కొలము
కృష్ణుడు కన్నడు
కైరవము కలువ
ఖడ్గము కగ్గము
గర్వము గరువము
గ్రహము గాము
గృహము గీము
గుణము గొనము
గౌరవము గారవము
ఘోరము గోరము
చంద్రుడు చందురుడు
చోద్యం సోదెము
ఛాయ చాయ
జీవితం జీతం
జ్యోతి జోతి
జ్యోతిషము జోస్యము
తంత్రము తంతు
తరంగము తరంగ
తర్కారి తక్కెడ
త్యాగం చాగం
తీరము దరి
తేజము తేజు
దిశ దెస
దివసము దినము
దీపము దివ్వె
ద్వీపము దీవి
దుఃఖము దూకవి
దూరం దవ్వు
దైవం దయ్యము
దృఢము దిటము
ధర్మము దమ్మము
ధాత తార
నిత్యము నిచ్చలు
నిద్ర నిదుర
నిమిషము నిముసం
నిశ నిసి
నీరము నీరు
న్యాయము నాయము
పంక్తి బంతి
పక్షి పక్కి
పట్టణము పట్నము
పద్యము పద్దెము
పరుషం పరుసం
పర్వం పబ్బం
పశువు పసరము
ప్రజ పజ
ప్రతిజ్ఞ ప్రతిన
ప్రశ్నము పన్నము
ప్రాకారము ప్రహరి
ప్రాణము పానము
ప్రాంతము పొంత
పుత్రుడు బొట్టి
పుణ్యము పున్నెము
పురి ప్రోలు
పుస్తకము పొత్తము
పుష్పము పూవు
ప్రే ప్రేముడి
బంధువు బందుగు
బలము బలుపు
బహువు పెక్కు
బ్రహ్మ బమ్మ, బొమ్మ
బ్రాహ్మణుడు బాపడు
బిలము బెలము
భక్తి బత్తి
భగ్నము బన్నము
భద్రము పదిలము
భాగ్యము బాగెము
భారము బరువు
భాష బాస
భిక్షము బిచ్చము
భీతి బీతు
భృంగారం బంగారం
భూమి బువి
భేదము బద్ద
మంత్రము మంతరము
మత్స్యము మచ్చెము
మతి మది
మర్యాద మరియాద
ముకుళము మొగ్గ
ముక్తి ముత్తి
ముఖము మొగము
ముగ్ధ ముగుద
మూలిక మొక్క
మేఘుడు మొగులు, మొయిలు
మృగము మెకము
యంత్రము జంత్రము
యత్నం జతనం
యాత్ర జాతర
యువతి ఉవిద
రత్నము రతనము
రాత్రి రాతిరి
రాశి రాసి
రిక్తము రిత్త
రూపము రూపు
లక్ష్మి లచ్చి
వశము వసము
వర్ణము వన్నె
వర్షము వరుసము
విద్య విద్దె
విధము వితము
విజ్ఞానము విన్నాణము
విశ్వాసము విసువాసము
వేగము వేగిరము
వేషము వేసము
వైద్యుడు వెజ్జ
వృద్ధ పెద్ద
వృద్ధి వద్ది
శక్తి సత్తి
శయ్య సెజ్జ
శ్రద్ధ సద్ద
శాస్త్రము చట్టము
శాల సాల
శిఖ సిగ
శిరము సిరము
శీతము సీతువు
శిష్యులు సిసువులు
శ్రీ సిరి
శుచి చిచ్చు
సంతోషము సంతసము
సందేశము సందియము
సత్త్వము సత్తువ
సత్యము సత్తెము
సముద్రము సంద్రము
స్వర్ణము సొన్నము
సాక్షి సాకిరి
సింహము సింగము
సంధ్య సంజ, సందె
స్తంభము కంబము
స్త్రీ ఇంతి
స్థలము తలము
హృదయము ఎద

Search

Books

Related