తెలుగు అలంకారములు

కావ్యములకు అలంకారములు సౌందర్యమును కలిగించును (ఎలాగైతే మానవులకు నగలు అలంకారము కలిగించునో). ఇవి ప్రధానంగా రెండు రకములు.
A శబ్దాలంకారములు: శబ్దమాత్ర ప్రధానములయినవి.
B అర్థాలంకారములు: అర్థ విశేషములు ప్రధానమైనది.
A శబ్దాలంకారములు
వృత్త్యానుప్రాసము: ఒక హల్లు అనేక పర్యాయములు వచ్చునట్లు చెప్పబడును.
ఉదా - తడబడిన బుడి బుడి అడుగులు.
ఉదా - నీ నూనె నా నూనెనేనని నేనన్ననా.
చేకాను ప్రాసము: అర్ధ భేధముతో రెండక్షరముల పదమును వెనువెంటనే ప్రయోగించడం.
ఉదా - వినయంబు, విస్మయంబును.
ఉదా - సుందర దరహాసం.
లాటానుప్రాసము: అర్ధమునందుగాక, తాత్పర్యమందునందు మాత్రమే భేదముండునట్లు ఒక పదమును వెనువెంటనే ప్రయొగించడం.
ఉదా - శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ.
ఉదా - కమలాక్షునర్చించు కరములు కరములు.
యమకము: అర్ధభేధము గల అక్షరముల సముదాయము మరల మరల ఉచ్చరించడం.
ఉదా - మనసు భద్రమయ్యె, మన సుభద్రకు.
ముక్తపద గ్రస్తము: పాదము చివర పదముతో తరువాత పదమును ప్రారంభించడం. ముక్త అనగా విడిచిన, గ్రస్తం అనగా తీసుకోడం.
అంత్యానుప్రాసము : పాదము/వాక్యము చివర భాగంలో ప్రాస వచ్చును.
ఉదా - ఇంట్లో దెయ్యం
నాకేం భయ్యం.
B అర్థాలంకారములు
ఉపమాలంకారము: ఉపమాన ఉపమేయాలకు గల పోలికను మనోహరముగా వర్ణించడం.
ఉత్ప్రేక్షాలంకారము: ఉపమేయమును ఊహించడం.
ఉదా - ఆ వచ్చుచున్న ఏనుగునడగొండమేమో అనునట్లున్నది.
రూపకాలంకారము: ఉపమాన, ఉపమేయములకు భేధమున్నను అభేధము చెప్పడం.
ఉదా - సంసార సాగరము నీదుట మిక్కిలి కష్టము
శ్లేషాలంకారము: అనేక అర్ధములు వచ్చునట్లు చెప్పడం.
ఉదా - రాజు కవలయానందకరుడు.
అర్ధాంతరన్యాసము: సామాన్యమును విశేషము చేతను,విశేషమును సామాన్యము చేతను సమర్థించడం.
ఉదా - మహాత్ములకు సాధ్యము కానిదేమున్నది.
అతిశయోక్తి: ఒక విషయము ఉన్నదానికంటే అధికము చేసి వర్ణించడం.
ఉదా - ఊరియందలి భవనములు ఆకాశమును అంటుసున్నవి.
దృష్టాంతము: ఉపమాన ఉపమేయములకు, బింబ ప్రతిబింబ భావము ఉండునట్లు వర్ణించడం.
ఉదా - ఓరాజా నీవే కీర్తిమంతుడవు.
స్వభావోక్తి: జాతి గుణజ్రియాదులలోని స్వభావము ఉన్నదున్నట్లు మనోహరముగా వర్ణించడం.
ఉదా - అరణ్యమునందు లేళ్లు బెదురు చూపులతో చెంగు చెంగున దుముకుచు పరిగెడుతున్నవి
ఉదాహరణ: చొక్క పుటుక్కు క్రిక్కిరిసి స్రుక్కక పెక్కువ నక్క జంబుగన్.
మరొక్క ఉదాహరణ పద్యంలో
గడన గల మగని జూసిన,అడుగడుగున మడుగులిడుదురు అతివలు తమలో, గడనుడిగిన మగని జూసిన నడుపీనుగ వచ్చె ననుచు నగుదురు సుమతీ.
ఈ పద్యంలో డ అనే అక్షరము పలుమార్లు వచ్చి శబ్దాలంకారాన్ని చేకూర్చింది. అలాగే వచనములో కూడా శబ్ధాలంకరమునకు మరొక ఉదాహరణ:
(అల్లసాని పెద్దనగారి మనుచరిత్రము లో) అనినన్ జిటిలుండు పటపటమని బండ్లు గొరికి, యటమటంమ్మున విద్య గొనుటయుంగాక గుట గుటలు గురుతోనా యని ..... ఇందులో ట అను అక్షరము పలుమార్లు వచ్చింది.
ఛేకానుప్రాసాలంకారము : అర్థ భేదము గల రెండేసి అక్షరములు వ్యవధానము లేకుండా వెనువెంటనే వచ్చుట. ఉదాహరణ: భీకర కర వికరముల్.
లాటానుప్రాసాలంకారము : అర్థభేధము లేక తాత్పర్య భేదము కలుగునట్లు ఒక పదము రెండు సార్లు ప్రయోగింపబడిన అది లాటానుప్రాసము. ఉదాహరణ: శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ.
యమకాలంకారము : అర్థభేదముగల అక్షరముల సమూహమును మరల మరల ప్రయోగింపబడినచో దానిని యమకము అంటారు. ఉదాహరణ: పురమునందు నందిపురమునందు.
ముక్తపదగ్రస్తాలంకారము : విడిచిన పద భాగము అవ్యవధానముగా మరల గ్రహించుచు వ్రాయబడిన అది ముక్తపదగ్రస్తము. ఉదాహరణ: ఓ రాజా! శత్రువులను జయించుము, జయించి రాజ్యమును పొందువు. పొంది ప్రజలను పాలింపుము. పాలించి సుఖమును పొందుము.
అంత్యప్రాసాలంకారము : మొదటి పాదం చివరి భాగంలో ఏ అక్షరంతో (అక్షరాలతో) ముగిసిందో, రెండో పాదం కూడా అదే అక్షరంతో (అక్షరాలతో) ముగుసినట్లైతే అది అంత్య ప్రాసం అవుతుంది. ఉదాహరణలు:
1. తోటలో నారాజు తొంగి చేసెను నాడు; నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు. 2. భాగవతమున భక్తి జీవితమున రక్తి
ఉపుమాలంకారం: ఉపమానానికి, ఉపమేయానికి సామ్య రూపమైన సౌందర్యాన్ని సహృదయ రం చెప్పడం ఉపమాలంకారం.
అన్వయాలంకారం: ఉపమానము, ఉపమేయము ఒకటే వస్తువగుచో అది అన్వయాలంకారం.
ఉపమేయోపమ అలంకారం: రెండు వస్తువులకు పర్యాయ క్రమమున ఉపమేయ ఉపమానత్వమును కల్పించి చెప్పడం ఉపమేయోపమ అలంకారం.
ప్రతీపాలంకారం : ఉపమానముగా ప్రసిద్ధమయిన దానిని, ఉపమేయంగా కల్పించి చెప్పడం ప్రతీపాలంకారం. అంటే ఉపమానం కావలసింది ఉపమేయంగా మారినందువల్ల రెండింటినీ ఉపమేయాలుగానే భావించవలసి వస్తుంది.
రూపకాలంకారం : ఉపమేయమునందు ఉపమాన ధర్మాన్ని అరోపించడం రూపకాలంకారం. ఉపమేయమునకు ఉపమానం తోటి అభేదాన్ని గాని, తాద్రూప్యాన్ని గాని వర్ణించటం రూపకం. ఒకటి అభేద రూపకం, రెండవది తాద్రూప్య రూపకం.
పరిణామాలంకారం : ఉపమానము ఉపమేయముతో తాదాత్మ్యమును పొంది క్రియను నిర్వహించిన అది పరిణామాలంకారం.
ఉల్లేఖాలంకారం : ఒక్క వస్తువే ఒక్కొక్కరికి ఒక్కొక్కటిగా కనిపించడం ఉల్లేఖాలంకారం.
భ్రాంతి మదలంకారం : ఒక దానిని చూచి మరొకటిగా భ్రమించినచో అది భ్రాంతిమత్ అలంకారం
సందేహాలంకారం : సందేహం (అనిశ్చయ జ్ఞానం) వలన ఏర్పడే అలంకారం సందేహాలంకారం.
ఉత్ప్రేక్షాలంకారము : ఉపమానమునందున్న ధర్మాలు ఉపమేయమునందు కూడా ఉండటం వలన ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఉత్ప్రేక్షాలంకారం.
అతిశయోక్త్యలంకారము : చెప్పవలసిన దానిని ఎక్కువ చేసి చెప్పడం, గొప్పగా చెప్పడం అతిశయోక్తి అలంకారం.
దీపకాలంకారం : ప్రకృతాప్రకృతములకు ధర్మైక్యం చేసి చెప్పడం దీపకాలంకారం.
ప్రతివస్తూపమాలంకారం : రెండు వాక్యముల కొక సామాన్య ధర్మముతో అన్వయం ఉంటే అది ప్రతి వస్తూపమాలంకారం. అంటే ప్రతి వాక్యార్ధంలోనూ ఒకే సమాన ధర్మాలను భిన్న పదాలచేత తెలియజేయడం.
దృష్టాంతాలంకారము : రెండు వాక్యాల యొక్క వేరువేరు ధర్మాలు బింబ ప్రతిబింబ భావంతో చెబితూ ఉంటే అది దృష్టాంతాలంకారం.
వ్యతిరేకాలంకారం : ఉపమేయ ఉపమానములకు పోలికతో పాటు భేదమును కూడా చెప్పినచో అది వ్యతిరేకాలంకారం.
పరికరాలంకారం : సాభిప్రాయ విశేషణాలతో కూడినచో అది పరికరాలంకారం.
శ్లేషాలంకారము : అనేకార్థాల నాశ్రయించుకొని యుండిన ఎడల అది శ్లేషాలంకారం.
అప్రస్తుత ప్రశంసాలంకారం : ప్రస్తుతమును ఆశ్రయించుకొని, అప్రస్తుతమును తలచుకొన్నచో అది అప్రస్తుత ప్రశంసాలంకారం.
వ్యాజస్తుతి అలంకారం : పైకి నిందిస్తున్నట్లుగా కనిపించినా తరచిచూస్తే స్తుతి చేస్తున్న విధం కనిపిస్తుంది. పైకి స్తుతిస్తున్నా తరచిచుస్తే నిందిస్తున్నట్లు కనిపిస్తుంటే వ్యాజస్తుతి అలంకారం.
వ్యాజనిందాలంకారం : నింద చేత మరియొక నింద స్ఫురించటం వ్యాజనిందాలంకారం.
ఆక్షేపము
విరోధాభాసాలంకారం : విరోధమునకు అభాసత్వము కలుగుచుండగా విరోధాభాసం అవుతుంది. పైకి కనిపించే విరోధం విరోధంగా కాకుండా విరోధం ఉన్నట్లుగా అనిపించి, ఆలోచిస్తే ఆ విరోధం అభాసం (పోతుంది) అవుతుంది. కనుక ఇది
విశేషోక్తి అలంకారం : సమృద్ధంగా కారణం ఉండి కూడా కార్యోత్పత్తి జరగక పోవడం విశేషోక్తి అలంకారం.
విషమాలంకారం : అనను రూపాలయిన (సమాలు కాని) రెండింటికి సంబంధం వర్ణింపబడిన ఎడల అది విషమాలంకారం.
సారాలంకారం : పూర్వపూర్వముల కంటే ఉత్తరోత్తరాలకు ఉత్కర్ష కలిగించడం సారాలంకారం. ముందున్న వాటి కంటే తర్వాత వచ్చేవాటికి గొప్పతనాన్ని కలిగించడం ఉత్తరోత్తర ఉత్కర్ష అంటారు.
యథాసంఖ్య అలంకారం : ఒక దాని తరువాత ఒకటిగా వరుసగా సమాన సంఖ్యాకాలయ్యే వాటి యొక్క సముదాయం యథాసంఖ్య లేదా క్రమ అలంకారం.
కావ్యలింగాలంకారం : సమర్థనీయమయిన అర్థానికి సమర్థనం కావ్యలింగాలంకారం.
అర్థాంతరన్యాసాలంకారం : సామాన్యం చేత విశేషం గాని, విశేషం చేత సామాన్యం గాని సమర్థింప బడితే అది అర్థాంతరన్యాసాలంకారం.
తద్గుణాలంకారం : స్వీయ గుణాన్ని వదిలేసి మరొక దాని గుణాన్ని స్వీకరించటం వర్ణించినట్లయితే అది తద్గుణాలంకారం.
లోకోక్తి అలంకారం : సందర్భాన్ని అనుసరించి ఒక సామెత లేదా నానుడి చెప్పడం లోకోక్తి అలంకారం.
ఛేకోక్తి అలంకారం : లోకోక్తితో పాటు అర్థాంతర స్ఫురణం కూడా ఉండటం ఛేకోక్తి అలంకారం.
వక్రోక్తి అలంకారం : శ్లేష వలన గాని, కాకువు వలన గాని అన్యార్ధం కల్పించబడిన అది వక్రోక్తి అలంకారం.
స్వభావోక్తి అలంకారం : జాతి, గుణ, క్రియాదుల చేత దాని స్వభావాన్ని వర్ణించిన ఎడల అది స్వభావోక్తి అలంకారం.
ఉదాత్తాలంకారం : సమృద్ధిని గాని, అన్యోపలక్షిత మయిన శ్లాఘ్య చరిత్రను గాని వర్ణించిన ఎడల అది ఉదాత్తాలంకారం అవుతుంది.

Search

Books

Related