శతకము అనగా ఒకే మకుటముతో కనీసం వంద పద్యాల సమూహం.
మకుటము అనగా పద్యము చివరలో రచయిత/శతకముకు గుర్తుగా, కొన్ని పదములు లేక పూర్తి చరణమును వాడుదురు.
తెలుగులో శతకము 12వ శతాబ్దంలో ఆవిర్భవించినది. కాల క్రమేణా కొన్ని వేల శతకములు రచించబడ్డాయి. శతక ముఖ్య లక్షణం మకుటం. దీని బట్టి పద్యం ఏ శతకము లోనిది అని సులభంగా గుర్తించవచ్చును. శతకమునకు, ఎక్కువ నియమాలు లేనందున, రచయితలకు ఎక్కువ స్వేఛ్ఛ ఉంటుంది. తెలుగులో వేమన, సుమతీ శతకము చాలా ప్రాచుర్యం పొందినవి. సంస్కృతంలో భర్తృహరి రచించిన సుభాషిత త్రిశతి ప్రసిద్ధి గాంచింది. దానిని ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళిగా, తెలుగులోనికి అనువదించారు.
శతకములు |
రచయిత |
వృషాధిప శతకము |
పాల్కురికి సోమనాథుడు |
సుమతీ శతకము |
బద్దెన |
సర్వేశ్వర శతకము |
యథావాక్కుల అన్నమయ్య |
వేమన శతకము |
వేమన |
దాశరథీ శతకము |
కంచర్ల గోపన్న (రామదాసు) |
శ్రీకాళహస్తీశ్వర శతకము |
ధూర్జటి |
నారాయణ శతకము |
పోతన |
భాస్కర శతకము |
మారన వెంకయ్య |
కుమార శతకము |
పక్కి వేంకట నరసింహ కవి |
కుమారీ శతకము |
పక్కి వేంకట నరసింహ కవి |
గువ్వల చెన్నా శతకం |
గువ్వల చెన్నడు |
ఆంధ్రనాయక శతకము |
కాసుల పురుషోత్తమ కవి |
శ్రీ వేంకటేశ్వర శతకము |
తాళ్ళపాక అన్నమాచార్యుడు |
కవి చౌడప్ప శతకము |
కవి చౌడప్ప |
సుభాషిత త్రిశతి |
భర్తృహరి |
సుభాషిత రత్నావళి |
ఏనుగు లక్ష్మణ కవి |
నరసింహ శతకము |
శేషప్ప |
సత్యవ్రతి శతకము |
గురజాడ అప్పారావు |
అల్లా మాలిక్ శతకము |
షేక్ దావూద్ |
హరిహరనాథ శతకము |
ముహమ్మద్ హుస్సేన్ |