SEARCH
పెద్ద బాలశిక్ష
తెలుగు సామెతలు (Telugu Proverbs)
OmniGuru
/
2020-01-01 13:24:10
అండ ఉంటే కొండనైనా బద్దలు కొట్టొచ్చు.
అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలు.
అంగట్లో అరువు. తల మీద బరువు.
అందని ద్రాక్షపళ్ళు పుల్లన అన్నట్లు.
అందానికి దాచిన ఆభరణం ఆపదలో ఆదుకుంటుంది.
అన్నం తిన్నవారు, తన్నులు తిన్నవారు మర్చిపోరు.
అయిపోయిన పెళ్లికి మేళాలెందుకు.
అరచేతిలో వెన్నపెట్టుకుని నెయ్యి కోసం ఊరంతా వెతికినట్లు.
అభాగ్యుడికి ఆశ ఎక్కువ, నిర్భాగ్యుడికి నిద్ర ఎక్కువ.
అల్లుడొచ్చేదాకా అమావాస్య ఆగుతుందా.
అవివేకితో స్నేహం కన్నా, వివేకితో విరోధం మేలు.
అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు.
అత్తలేని కోడలు ఉత్తమురాలు. కొడల్లేని అత్త గుణవంతరాలు.
ఆరే దీపానికి వెలుగు ఎక్కువ.
ఇంట గెలిచి రచ్చ గెలువు.
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.
ఇల్లు అలకాగనే పండగ కాదు.
ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు.
ఇల్లు పీకి పందిరేసినట్లు.
ఉన్న మాటంటే ఉలుకెక్కువ.
ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి.
ఎంత చెట్టుకు అంత గాలి.
ఎలుకకు పిల్లి సాక్ష్యం.
ఎద్దు పుండు కాకికి ముద్దు
ఏ చెట్టూ లేని చోటా ఆముదపు చెట్టే మహావృక్షం
ఏరు దాటి తెప్ప కాల్చినాట్లు.
ఒక పూట తినేవాడు యోగి, రెండు పూటలా తినేవాడు భోగి, మూడు పుటలా తినేవాడు రోగి.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.
ఒక వరలో రెండు కత్తులిమడవు.
కుక్కకాటుకు చెప్పుదెబ్బ.
కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టిందంట.
చెవిటివాని ముందు శంఖమూదినట్లు.
చేతిలో బెల్లం ఉంటేనే ఈగలు.
డబ్బుకు లోకం దాసోహం.
తంతే బూరెల బుట్టలో పడ్డట్లు.
తీగ లాగితే డొంక కదిలినట్లు.
దిగితేకాని లోటు తెలియదు.
దూరపు కొండలు నునుపు.
నల్లకోడికైనా తెల్ల గుడ్డే.
నవ్వు నాలుగు రకాల చేటు.
నలుపు నారాయణ మెచ్చు.
నాలుక ఉన్నవాడు నాలుగు దిక్కులు తిరగగలడు
నారు పోసినవాడు నీరు పోయకమానడు.
నిప్పు లేనిదే పొగ రాదు.
నిండా మునిగినవాడికి చలేమి.
నిండు కుండ తొనకదు.
నీరు పల్లమెరుగు. నిజం దేవుడెరుగు.
పిల్లికి ఎలుక సాక్ష్యం.
పిండి కొద్దీ రొట్టె. కుండకొద్ది నీళ్ళు.
పిచ్చుకపై బ్రహ్మాస్త్రం.
పిట్ట కొంచెం. కూత ఘనం.
పొమ్మనలేక పొగబెట్టినట్టు.
మింగ మెతుకు లేదు, మీసాలకు సంపంగి నూనె.
రెక్కాడితే కానీ డొక్కాడదు.
వసుదేవుడు పోయి గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు.
వాపు బలుపు కాదు వాత అందమూ కాదు.
విగ్రహం పుష్ఠి, నైవేదం నష్ఠి.
శంఖంలో పోస్తేనే తీర్థం.
Search
SEARCH
Books
పెద్ద బాలశిక్ష (48)
English (19)
భక్తి (15)
Aptitude (17)
ఆరోగ్యం (13)
GK (37)
జ్యోతిష్యం (8)
అందం (5)
రాజయోగ (5)
Technology (3)
సినిమా (2)
Startups (1)
Sports (2)
MISC (4)
Tools (23)
Writings (1)
Related
మహా శివరాత్రి
పెద్ద బాలశిక్ష
OmniGuru
/
2020-01-01 13:24:10
దీపావళి : ప్రాముఖ్యత, విశేషాలు
పెద్ద బాలశిక్ష
OmniGuru
/
2020-01-01 13:24:10
విజయదశమి : ప్రాముఖ్యత, విశేషాలు
పెద్ద బాలశిక్ష
OmniGuru
/
2020-01-01 13:24:10
అక్షరమాల (వర్ణమాల)
పెద్ద బాలశిక్ష
OmniGuru
/
2020-01-01 13:24:10
ఒత్తులు
పెద్ద బాలశిక్ష
OmniGuru
/
2020-01-01 13:24:10
తెలుగు నెలలు ఋతువులు
పెద్ద బాలశిక్ష
OmniGuru
/
2020-01-01 13:24:10
తిథులు - పక్షములు
పెద్ద బాలశిక్ష
OmniGuru
/
2020-01-01 13:24:10
తెలుగు సమాసములు
పెద్ద బాలశిక్ష
OmniGuru
/
2020-01-01 13:24:10