వివిధ చిట్కాలు

తేనెలో ఉసిరిని నానబెట్టి తినడం వలన ఆస్తమా తగ్గుతుంది, చర్మ సౌందర్యం వృద్ధి చెందుతుంది.


మొలకెత్తిన పెసలు: A, B, C, D, E విటమిన్లు కలిగి ఉంటాయి. రక్తహీనత గుండె సమస్యలను నియంత్రిస్తుంది. కణజాల నిర్మాణ సరిగా జరిగి, యవ్వనంగా కనిపిస్తారు. కంటి చూపు మెరుగు పడుతుంది. కొవ్వు కరగడంలో కీలక పాత్ర పోషిస్తుంది.


పళ్లు శుభ్రం చేసుకునే ముందు కొంచెం కొబ్బరి నూనెను దంతాలకు బాగా పట్టించి 5 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి. అందులోని లారిక్ ఆసిడ్ దంతాలపై ఉండే పసుపు పచ్చ పొరను తొలగించి, దంతాలు తెల్లగా అవడానికి సహకరించడం తో పాటు, నోటిలోని బాక్టీరియా వృద్ధి చెందకుండా నివారిస్తుంది.


నేరేడు గింజల పొడిని ప్రతి రోజూ ఉదయం గ్లాసు నీళ్లలో, ఒక స్పూన్ కలుపుకుని తాగడం వలన అతి మూత్ర సమస్యను అదుపులోనికి తెస్తుంది. ఈ ప్రక్రియను క్రమం తప్పకుండా కనీసం 30 నుంచి 40 రోజుల వరకు తాగాలి. ఇలా చేయడం వలన శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.


అజీర్తి వల్ల త్రేపులతో ఇబ్బంది పడుతుంటే, ఒక స్పూన్ చక్కెర లో 4 చుక్కల మెంతుల నూనెను కలిపి సేవించడం వల్ల సమస్యకి కొన్ని నిమిషాల్లో ఉపశమనం లభిస్తుంది.


తినే ఆకులో విషం ఉంటే, అరిటాకు నల్లగా మారుతుంది.


ప్రతి రోజూ ఉదయం ఒక రెండు ఖర్జూరాలు తింటే, రక్త పోటు నియంత్రణలో ఉంది, గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఎముకలు దృఢంగా మారి శరీరం శక్తిని పుంజుకుంటుంది. కొవ్వు నియంత్రణలో ఉంటుంది. రేచీకటి పోతుంది. గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది.


Related