పరిచయం (ఆరోగ్యం)

"ఆరోగ్యమే మహాభాగ్యము" అన్నది మన పెద్దలు చెప్పే ఒక నానుడి. ఇది అక్షర సత్యము. ఆరోగ్యం లేకపోతే మనం ఏమి సాధించలేము.

ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఆరోగ్యం అంటే కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. అందుకోసం మా పాఠకులకు ధ్యానం, ప్రాణాయామం మొదలగు ఆంశాలపై కూడా కావల్సిన అంశాలను పొందుపరుస్తున్నాం. ఆరోగ్యం అంటే పెద్ద పెద్ద కండలు, సిక్స్ ప్యాక్ కలిగి ఉండటమే కాదు, కఠినమైన పరిస్థితులలో మానసికంగా బలంగా ఉండాలి. మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి.

మన రోజువారీ దినచర్యలలో, ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేసి, అనారోగ్యం పాలయ్యాక వైద్యశాలలకు అమితంగా ధనం వృధా చేసి మరీ కొత్త రోగాలను కొని తెచ్చుకుంటున్నాము అనేది వాస్తవం. ఆరోగ్యకరమైన జీవితంపై ప్రతి ఒక్కరూ సరైన అవగాహన పెంపొందించుకోవాలనే సదుద్దేశంతో ఉపయోగపడే అంశాలను ప్రజానీకానికి అందించడం మా ప్రధాన లక్ష్యం.

హెచ్చరిక! మేము సేకరించిన ఈ సమాచారం అంతా మన పెద్దలు చెప్పే విషయాలు,
అంతర్జాలం (ఇంటర్నెట్) నుండి పరిశోధన చేసి క్రోడీకరించి క్లుప్తంగా వ్రాయబడింది. మీరు ప్రయత్నించిన ఏ చిట్కాలు అయినా మీరు మీ పెద్దల ద్వారా మరలా ఒకసారి నిర్ధారించుకుని ప్రయత్నించ వలసిందిగా మనవి. ఏవైనా ప్రతికూల పరిస్థితులకు మేము బాధ్యులం కాము అని విజ్ఞప్తి చేస్తున్నాము.

Related