మనం పళ్లు శుభ్రం చేసుకోడానికి అనేక రకాల పేస్ట్ లను ఉపయోగిస్తున్నాము. అందులో మనకు హాని కలిగించే అనేక రకాల రసాయనాలు కలిగి ఉన్నాయని అందరికీ తెలిసిన వాస్తవం. పొరపాటున పేస్ట్ ను మింగితే కేన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. రసాయనాలతో నిండిన పేస్ట్ ల బదులు ఈ కింద తెలుపబడిన పద్ధతులలో పళ్ళను శుభ్రం చేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిదని తెలుపుతున్నాం. ఒక వేళ పేస్ట్ లు తప్పని సరి అయితే, పేస్ట్ మీద పచ్చ రంగు స్క్వేర్ బాక్స్ లో పచ్చ చుక్కతో గల పేస్ట్ లను ఉపయోగించండి.


Method


వేప పుల్లతో శుభ్రం చేసుకోడం వల్ల పళ్ల చిగుళ్ళలోని హానికరమైన బాక్టీరియా చనిపోతుంది. ఇది మన సంస్కృతిలోని పద్ధతి. ప్రతిరోజూ వేప పుల్లతోనే కాకుండా కింద తెలిపిన ఇతర పద్ధతుల ద్వారా పంటి మీద గారలను తొలగించుకోవచ్చు.


Method


సాల్ట్ మిశ్రమాన్ని నిమ్మ రసంతో కలిపి పళ్లు శుభ్రం చేసుకోడం వలన పళ్లు అతి త్వరితంగా తెల్లబడుతాయి. కొంతమందికి లేత చిగుళ్ళు కలవారికి నోటిలో పగుళ్లు ఏర్పడుతాయి. అందువల్ల తక్కువ మోతాదులో వినియోగించాలి.


Method


పటిక ని పొడి చేసుకుని దాంతో పళ్ళు తోముకోవాలి. ఇలా చేయడం వల్ల పళ్ల మీద గార పోతుంది.


Method


అరటి తొక్క తీసుకుని, తొక్క లోపలి వైపు ఉన్న తెలుపు భాగాన్ని పేస్ట్ లాగా చేసుకుని దాంతో పళ్లు శుభ్రం చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వలన, అందులోని పొటాషియం సహజంగానే పళ్లు తెళ్లబడటానికి సహాయపడుతుంది.


Method


బొప్పాయి పండు లో చిన్న ముక్కను తీసుకుని పేస్ట్ లాగా చేసుకుని పళ్లు తోముకోవాలి. ఇందులోని ఎంజైమ్స్ సహజ సిద్ధంగా పళ్ల తెలుపుకు సహాయపడుతుంది


Method


చిటికెడు పసుపులో సరిపడినంత రోజ్ వాటర్ చుక్కలు కలిపి పేస్ట్ చేసుకుని పళ్లు తోముకుని గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి.


Books

Related