బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురిసి వరదలతో ముంచెత్తాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ ఆస్తి నష్టంతో పాటు, దురదృష్టవశాత్తూ పలు చోట్ల ప్రాణ నష్టం కూడా జరిగింది.
ఈ ప్రకృతి వైపరీత్యం ఇబ్బందుల వల్ల, తమిళనాడు సీఎం పళనిస్వామి గారితో తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఫోన్ లో సంభాషించి, రాష్ట్ర పరిస్తితులను వివరించి, రాష్ట్రానికి చేసిన ఆర్థిక సహాయాన్ని కృతజ్ఞతలు తెలిపారని, దానికి స్పందించిన పళనిస్వామి ఆర్థిక సహాయమే కాకుండా వస్తు రూపంలో సహాయం చేయడానికి అంగీకరించి ఉదారత చాటుకున్నారని తెలంగాణ సీఎంఓ తెలిపింది.