వాతావరణ హెచ్చరిక: ఆంధ్రాలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాబోయే 48 గంటలు (సోమవారం, మంగళవారం) ఆంధ్ర ప్రదేశ్ లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా గోదావరి జిల్లాల నుంచి మొదలుకుని రాయలసీమ జిల్లాల వరకు మధ్యస్తం - భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన ఉత్తరాంధ్ర జిల్లాలలో ఒక మాదిరి వర్షాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

ప్రజలు బయట అనవసరంగా తిరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములు వచ్చేటప్పుడు చెట్ల కింద ఉండొద్దని, మొబైల్ + టీవీ లాంటి పరికరాలు ఆపి వేయాలని మా పాఠకులకు సూచిస్తున్నాము.

Related