అష్ట కుంభకాలు

ప్రాణాయామంలోని ముఖ్యమైన పద్ధతులను ఎనిమిది రకాలుగా విభజించారు. వీటిని అష్ట కుంభాకాలు అంటారు.


ఈ అన్ని రకాల ప్రాణాయామాలు వజ్రాసనం లేదా పద్మాసనం లేదా అర్థ పద్మాసనం లేదా సుఖాసనం లో ఉండి చేయాలి. ఈ ప్రాణాయామం చేసే ముందు, ప్రాణాయామం గురించి తెలిపిన వ్యాసమును చక్కగా చదివి అర్థం చేసుకోవలెను.1. సూర్య భేదసము


సూర్య నాడిని ఉత్తేజితం చేసి, శరీరంలో ఉష్ణోగ్రతను పెంచును. ఈ ప్రాణాయామం చేసి హిమాలయాలలోని యోగులు అంత చలిలో కూడా ఉండగలరు.


విధానం


ముక్కు కుడి ద్వారము నుంచి గాలిని శరీరం ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. జాలంధర బంధము (గడ్డమును కిందకి వంచి రొమ్ముకి ఆనించి) చేసి, ఉడ్యాణబంధము (పొట్టను వెనుకకు లాగి) చేసి, గాలిని ఎడమ ముక్కులో నుండి నెమ్మదిగా వదలాలి.2. ఉజ్జాయి


ఉజ్జాయి అనగా చిన్న పిల్లలకు వచ్చు గురక శబ్దం. ఈ ప్రక్రియ ద్వారా ఊపిరితిత్తులకు శక్తి పెరుగుతుంది. ఆస్తమా, శ్లేష్మ రోగాల నియంత్రణకు సహకరిస్తుంది.


విధానం


కంఠమును కూచించి, రెండు ముక్కలతో గాలిని బాగా పీల్చాలి. కుంభక స్థితి తర్వాత ఎడమ ముక్కు నుండి గాలిని వదలాలి.3. సీత్కారి


ఈ ప్రక్రియ ద్వారా అలసట నుంచి ఉపశమనం వస్తుంది. శరీరం బలం పుంజుకుని ఉత్తేజితం అవుతుంది.


విధానం


నాలుక కొనను పెదవుల మధ్యకి మరియు పళ్ల కొసకి ఆనించి సీత్కార శబ్దంతో గాలిని పీల్చాలి. కుంభక ప్రక్రియ తర్వాత ఎడమ ముక్కుతో గాలిని వదలాలి.4. శీతలి


ఈ ప్రక్రియ చేయడం ద్వారా శరీరంలోని అతి వేడి తగ్గుతుంది. గాయాలు త్వరగా మానడానికి సహకరిస్తుంది. ఎక్కిళ్ళు నియంత్రిస్తుంది. వడదెబ్బ నుండి, అతి దాహం నుంచి తక్షణ ఉపశమనం కల్గిస్తుంది.


విధానం


నాలుకను బైటికి చాచి, 'U' ఆకారంలో గొట్టంలా మార్చి, నెమ్మదిగా గాలిని పీల్చాలి. కుంభక స్థితి తర్వాత కుడి, ఎడమ ముక్కలతో మార్చి మార్చి వదలాలి.5. భస్త్రిక


సుషుమ్న నాడిని శుద్ధి చేసి కుండలినీ శక్తిని ఉత్తేజితం చేయడానికి సహకరిస్తుంది.


విధానం


కుడిముక్కుని బంధించి, ఎడమ ముక్కుతో కపాలం అంటేలా గాలిని శబ్దముతో పీల్చాలి. అదే కుడి ముక్కుతో శబ్దం వచ్చేలా వదలాలి. ఇలా 20-30 సార్లు చేయాలి. ఆఖరుగా ఊపిరి తిత్తుల నిండా గాలి పీల్చి, కుడి ముక్కుతో నెమ్మదిగా వదలాలి.


ఇదే ప్రక్రియను వ్యతిరేక పద్ధతిలో ముక్కు మార్చి చేయాలి.6. భ్రామరి


భ్రామరి అనగా తుమ్మెద. అంటే ఈ ప్రక్రియలో మనం తుమ్మెదల ఝుంకారం చేస్తాము. ఇలా చేయడం వల్ల శరీరం వేడి ఎక్కడం, చల్ల బడటం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ శరీరం ఆనందానుభూతిని ఇస్తుంది.


విధానం


ముక్కు కుడి రంధ్రాన్ని బంధించి, ఎడమ ముక్కుతో గాలిని పీల్చే సమయంలో వేలితో అవరోధం కల్పిస్తూ ఉంటే తుమ్మెదల ఝుంకార శబ్దం వస్తుంది. మరలా ఎడమ ముక్కుని బంధించి కుడి ముక్కుతో శబ్దం చేస్తూ గాలిని పీల్చాలి.7. మూర్ఛ


ఇది కఠిన ప్రక్రియ కావడం చేత, ఈ విధానాన్ని గురువు పర్యవేక్షణలో నేర్చుకోవాలి. ఈ ప్రక్రియలో మూర్ఛ స్థితికి చేరుకుని, చర్మ రంధ్రాలు నుండి స్తంభించిన వాయువులు విసర్జించడం జరుగుతుంది. అందువల్ల చర్మ రోగాలను అధిగమించి, చర్మం కాంతింతమవుతుంది.


విధానం


రెండు ముక్కలతో గాలిని ఊపిరి తిత్తుల నిండా పీల్చుకుని, త్రివిధ బంధములతో కుంభక స్థితిలో వాయువుని బంధించి ఉండాలి. అందువల్ల స్తంభించిన వాయువులు చర్మ రంధ్రాలు గుండా బయటకు వెళ్తాయి. ఇలా చేయడం వలన శరీరం వేడెక్కి మూర్ఛ స్థితిలోకి వెళ్తాము.8. ప్లావని


ప్లావని అనగా తేలడం. ఇది కూడా కఠిన ప్రక్రియ కావడం చేత, ఈ విధానాన్ని గురువు పర్యవేక్షణలో నేర్చుకోవాలి. ఇందులో బాగా ఆరి తేరిన వారు నీటిలో కూడా కుంభక స్థితిలో తేలి ఉండగలరు. కుండలినీ జాగృతి కలుగుతుంది.


విధానం


నోటితో గాలిని కొంచెం కొంచెం తీసుకుని పొట్ట ఉబ్బుగా వచ్చేలా చేయాలి. తర్వాత కుంభకం ప్రక్రియ చేయాలి. తర్వత నోటితో కాని, ముక్కుతో కానీ నెమ్మదిగా గాలిని వదలడం చేయాలి.


Related