సూర్య నమస్కారం 12 ఆసనాల సమ్మేళనం. ఇది సూర్యోదయ వేళలో సూర్యునికి అభిముఖంగా చేయడం ఉత్తమం.
దశల వారీగా ఒక్కో ఆసనం వేయాలి. ఆసనం తగ్గ విధంగా పూరక, రేచక, కుంభక పద్ధతులను అవలంబిస్తూ నెమ్మదిగా ప్రశాంతంగా చేయాలి. ఆసనం తగ్గ మంత్రాన్ని జపిస్తూ, ఆ అసన సమయంలో, ఆయా చక్రాల స్థానంలో దృష్టిని కేంద్రీకరించాలి.
సూర్యునికి అభిముఖంగా నిటారుగా నిలబడి సూర్యునికి నమస్కరించి పూరకం రేచకం చేయాలి. ఆఖరి రేచకం తర్వాత తర్వాత దశలోకి వెళ్ళాలి.
చేతులు పైకి ఎత్తి, గాలిని పీలుస్తూ వెనక్కి శరీరాన్ని వంచాలి.
శ్వాసని నెమ్మదిగా వదులుతూ ముందుకి వంగి, తల నుదురు మోకాళ్ళ కింద ఆనించి, రెండు అర చేతులను పాదముల పక్కన భూమికి ఆనించాలి.
గాలి పీలుస్తూ, ఎడమ మోకాలిని వంచి, కుడి కాలును వెనక్కి పోనిచ్చి, కుడి మోకాలు నుండి కుడి పాదం పై భాగం వరకు భూమికి తగిలేలా ఉంచాలి. అరచేతులు ఎడమ పాదంకి ఇరువైపులా సమాన దూరంలో ఉంచాలి.
అర చేతులు భూమికి అలానే ఆనించి, అరి కాళ్ళు రెండు నేలకు ఆనించి, నడుము పూర్తిగా పైకి లేపి పర్వతం ఆకారంలో ఉండాలి.
ఈ దశలో గాలిని కుంభించి (బిగబట్టి), గడ్డం, ఛాతీ, రెండు అర చేతులు, రెండు మోకాళ్లు, రెండు పాదాల పై భాగాలు నేలకు ఆనించి నడుము కొంచెం పైకి లేపి ఉంచాలి. ఈ ఆసనంలో మన శరీరంలోని 8 భాగాలు నేలకి తగిలేలా ఉంటుంది.
శ్వాసను పీలుస్తూ, అర చేతులు నడుము పక్కన భూమికి ఆనించి, తొడల నుండి అరికాళ్ళ పై భాగం వరకు నేలకు ఆనించి, నడుము నుండి తల వరకు వెనుకకు వంచాలి.
అర చేతులు భూమికి అలానే ఆనించి, అరి కాళ్ళు రెండు నేలకు అనించి, నడుము పూర్తిగా పైకి లేపి పర్వతం ఆకారంలో ఉండాలి.
నాల్గవ దశలో ఎడమ మోకాలిని వంచి, కుడి కాలుని వెనక్కి పోనిచ్చాం. ఈ సారి కుడి మోకాలిని వంచి ఎడమ కాలుని వెనక్కి పోనిచ్చాలి.
మూడవ దశ మాదిరిగానే శ్వాస వదులుతూ చేయాలి.
రెండవ దశ మాదిరిగానే శ్వాస పిలుస్తూ చేయాలి.
మళ్లీ సూర్యునికి నమస్కరించాలి.
సూర్య నమస్కారం వల్ల కలిగే ఉపయోగాలు అన్ని ఇన్నీ కావు. రోజుకి ఒక 5-10 నిమిషాలు దీని కోసం సమయం కేటాయించడం ఉత్తమం.