వీరూ భాయ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

వీరేంద్ర సెహ్వాగ్ ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. ఆడిన మొదటి బంతి నుంచే ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. ఈ అరుదైన బ్యాట్స్మెన్ యొక్క 42వ పుట్టిన రోజు సందర్భంగా అనేక మంది ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఐసీసీ, బిసీసీఐ లు తమ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తన సహచర బ్యాట్స్మెన్ సురేశ్ రైనా ఈ విధంగా ట్వీట్ చేశారు.

సెహ్వాగ్ భారత దేశానికి ప్రాతినిథ్యం వహించి మొత్తం 17,253 పరుగులు చేశారు. టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచురీలు చేసిన ఏకైక భారత ఆటగాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ముగ్గురు భారత ఆటగాళ్లలో ఒకరు. 2011 వరల్డ్ కప్ లీగ్ మ్యాచుల్లో మొదటి బంతినే బౌండరీకి బాదిన డేరింగ్ + డాషింగ్ ఓపెనర్. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని రికార్డులు. ఇలా భారత క్రికెట్ కు సేవలందించిన ఒక గొప్ప ఆటగాడు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాము.

Related