#01 ముంబై vs చెన్నై: తొలి పోరులో చెన్నై విజయం

అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఐపియల్ 2020 రానే వచ్చింది. గత సీజన్ విన్నర్ ముంబై ఇండియన్స్, రన్నర్ అప్ చెన్నై సూపర్ కింగ్స్ అబు దాబి వేదికగా తలపడ్డాయి.

టాస్ గెలిచిన చెన్నై మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 162/9 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (12), క్వింటన్ డి కాక్ (33), సూర్యకుమార్ యాదవ్ (17), సౌరభ్ తివారీ (42), హార్దిక్ పాండ్యా (14) పరుగులు సాధించారు. బౌండరీ వద్ద డుప్లెసిస్ రెండు క్యాచ్‌లు అందుకున్నాడు. మొదటి పది ఓవర్లలో సత్తా చూపించిన ముంబై తర్వాత 10 ఓవర్లలో చెన్నై బౌలర్ల దాటికి వేగంగా వికెట్లు కోల్పోయింది.


చేజింగ్ లో చెన్నై ఆరంభంలోనే మొదటి ఇద్దరినీ కోల్పోయింది. డుప్లెసిస్ (58*) నాట్ అవుట్ తో ఆఖరి వరకు నిలబడి రెండు చక్కని బౌండరీలతో మ్యాచ్ ను ముగించాడు. వరల్డ్ కప్ కు సెలక్ట్ అవ్వని అంబటి రాయుడు (71) పరుగులు చేసి తానెంత విలువైన ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యం చెన్నైకి విజయాన్ని సునాయాసం చేసింది. చివర్లో రవీంద్ర జడేజా 2 ఫోర్లు, సామ్ కుర్రాన్ 1 ఫోర్ + 2 సిక్సర్స్ తో అలరించారు. కాగా సామ్ కుర్రాన్ బౌలింగ్ లో కూడా 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి, 1 వికెట్ తీసుకుని, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు.


అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై ప్రకటించిన ధోని మొదటి సారిగా మైదానంలో అడుగు పెట్టిన సందర్భంగా, అభిమానులు తన బ్యాటింగ్ కోసం ఎదురు చూశారు, కానీ నిరాశే ఎదురైంది. చివర్లో ధోని (0*) దిగినప్పటికీ, తన మెరుపులు చుపించకముందే 165/5 తో చెన్నై విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.
Books

Related