#02 ఢిల్లీ vs పంజాబ్: సూపర్ ఓవర్ డ్రామా

ఈ మ్యాచ్ లో మొదటి నుంచి విజయం ఒకరి నుంచి మరొకరికి మారుతూ దోబూచులాట ఆడింది. ఆఖరికి డ్రా నేపథ్యంలో మొదలైన సూపర్ ఓవర్ లో ఢిల్లీ విజయాన్ని సొంతం చేసుకుంది.


టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ వైపు పృథ్వీ షా (5), ధావన్ (0), హెట్మియర్ (7), శ్రేయాస్ అయ్యర్ (39), పంత్ (31), స్టోయినిస్ (53), ఆక్సర్ (6), అశ్విన్ (4), రబాడా (0*), నార్ట్జే (3) పరుగులతో మొత్తంగా 157/8 సాధించారు. కాగా షమి 3, కోట్రెల్ 2, బిష్ణోయ్ 1 వికెట్లు తీసుకున్నారు.


తరువాత ఢిల్లీ లోకేష్ రాహుల్ (21), మయాంక్ అగర్వాల్ (89), కరుణ్ నాయర్ (1), నికోలస్ పూరన్ (0), గ్లెన్ మాక్స్వెల్ (1), సర్ఫరాజ్ ఖాన్ (12), కృష్ణప్ప గౌతమ్ (20), క్రిస్ జోర్డాన్ (5) 157/8 సాధించారు. మయాంక్ తన అద్భుతమైన బ్యాటింగ్ తో ఓడిపోయే మ్యాచ్ ను గెలుపు దిశగా తీసుకువచ్చి, మ్యాచ్ డ్రా చేసిన అనంతరం దురదృష్టవశాత్తు ఔట్ అయ్యి వెనుదిరిగాడు. రబడ, అశ్విన్, స్టోయినిస్ రెండేసి వికెట్లు తీసుకోగా, మోహిత్, ఆక్సర్ ఒక వికెట్ తీసుకున్నారు.


సూపర్ ఓవర్ లో రబడ రెచ్చిపోయి రెండు పరుగులిచ్చి 2 వికెట్లు (రాహుల్, పూరన్) తీసుకున్నాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ అలవోకగా విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా స్టోయినిస్ 53 పరుగులు, 2 వికెట్ల తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. పూరన్ మాత్రం ఒకే మ్యాచ్ లో రెండు సార్లు డక్ అవుట్ అవ్వడం ఒక వింతగా చెప్పుకోవచ్చు.
Books

Related