ఈ అష్టోత్తరీ దశా విధానంలో మొత్తం 8 దశలు ఉంటాయి. ఇందులో వింశోత్తరీ దశ మాదిరిగా కేతు దశ ఉండదు. వింశోత్తరీ దశలో 120 సంవత్సరాల దశా కాలం ఉంటే, ఇందులో మొత్తం 108 సంవత్సరాల దశా కాలం ఉంటుంది. మన దేశంలో ఎక్కువగా వింశోత్తరీ దశ ఉపయోగిస్తున్నప్పటికీ అష్టోత్తరీ దశా విధానం ద్వారా కూడా చాలా మంది పండితులు ఖచ్చితమైన ఫలితములను తెలుపుతున్నారు.
దశాధిపతులు |
దశాకాలం (సం) |
నక్షత్రములు |
రవి |
6 |
ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష |
చంద్రుడు |
15 |
మఖ, పుబ్బ, ఉత్తర |
కుజుడు |
8 |
హస్త, చిత్త, స్వాతి, విశాఖ |
బుధుడు |
17 |
అనురాధ, జ్యేష్ఠ, మూల |
శని |
10 |
పూర్వాషాడ, ఉత్తరాషాఢ, అభిజిత్, శ్రవణం |
గురుడు |
19 |
ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర |
రాహువు |
12 |
ఉత్తరాభాద్ర, రేవతి, అశ్వని, భరణి |
శుక్రుడు |
21 |
కృత్తిక, రోహిణి, మృగశిర |
పై పట్టిక ఆధారంగా ఒకరు ఆరుద్ర నక్షత్రంలో జన్మిస్తే అతనికి 6 సంవత్సరాల రవి దశాకాలం ఉంటుంది. ఒక వేళ పుష్యమి నక్షత్రంలో జన్మించిన యెడల అతనికి 2 వ వంతు అనగా 3 సంవత్సరాల రవి దశా కాలం ఉంటుంది.