మనకు జ్యోతిష్య శాస్త్రము ప్రకారం అశ్వని, భరణి, కృత్తిక మొదలుకొని పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి వరకు మొత్తం 27 నక్షత్రాలు కలవు. 27 నక్షత్రాలకు కాల అధి దైవాలను, మరియు వాటి ఆకృతి (నక్షత్రాల సముదాయం) ను కింది పట్టికలో పేర్కొన్నాము.
నక్షత్రం | అధిదైవాలు | ఆకారం | |
1 | అశ్వని | అశ్వనీ దేవతలు | గుర్రం ముఖం (3 నక్షత్రాల గుంపు) |
2 | భరణి | యముడు | యోని (3 నక్షత్రాలు) |
3 | కృత్తిక | అగ్ని | మంగలి కత్తి (6 నక్షత్రాలు) |
4 | రోహిణి | ప్రజాపతి | బండి (5 నక్షత్రాలు) |
5 | మృగశిర | చంద్రుడు | శిరస్సు (3 నక్షత్రాలు) |
6 | ఆరుద్ర | రుద్రుడు | పగడం ఆకృతిలో మెరుస్తూ ఒక నక్షత్రం |
7 | పునర్వసు | అదితి | బండి (5 నక్షత్రాలు) |
8 | పుష్యమి | బృహస్పతి | సరళాకృతిలో వరుసగా 3* |
9 | ఆశ్లేష | సర్పం | సర్పం (6 *) |
10 | మఖ | పితురులు | పల్లకి (5*) |
11 | పుబ్బ | భగుడు | కన్ను (పుబ్బ, ఉత్తర *) |
12 | ఉత్తర | అర్యముడు | కన్ను (పుబ్బ, ఉత్తర *) |
13 | హస్త | సూర్యుడు | చేతి వేళ్ళు (5 *) |
14 | చిత్త | విశ్వకర్మ | ముత్యం (1 *) |
15 | స్వాతి | వాయువు | మాణిక్యం (1*) |
16 | విశాఖ | ఇంద్రాగ్నులు | కుమ్మరి సారె (5 *) |
17 | అనూరాధ | మిత్ర (సూర్య) | గొడుగు (అనూరాధ జ్యేష్ఠ 3 *) |
18 | జ్యేష్ఠ | ఇంద్ర | గొడుగు (అనూరాధ జ్యేష్ఠ 3 *) |
19 | మూల | నిరృతి | కోపించిన కేసరి (5 *) |
20 | పూర్వాషాఢ | ఉదకములు | కప్ప (పూషా, ఉషా 2*) |
21 | ఉత్తరాషాఢ | విశ్వ దేవతలు | కప్ప (పూషా, ఉషా 2*) |
22 | శ్రవణం | విష్ణు | చేప (3 *) |
23 | ధనిష్ఠ | వసువులు | శిరస్సు (3*) |
24 | శతభిషం | వరుణుడు | 100 తారల గుంపు |
25 | పూర్వాభాద్ర | అజైక పాదుడు | మంచం (పూభా 2*) |
26 | ఉత్తరాభాద్ర | అహిర్భుద్య్న | మంచం (పూభా 2*) |
27 | రేవతి | పూష (సూర్య) | చేప (3 *) |
ఒక్కో నక్షత్రానికి 4 పాదములు ఉంటాయి. పుట్టిన నక్షత్ర పాదం బట్టి ఒక వ్యక్తి యొక్క రాశిని చెబుతాము. ఒక్కొక్క రాశి ఏ పాదంతో మొదలైనా కూడా మొత్తం 9 నక్షత్ర పాదాలను కలిగి ఉంటుంది. అనగా ఒక రాశి అత్యధికంగా 3 నక్షత్రాలను కలిగి ఉంటుంది.
అందువల్ల జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఉద్దేశం ఉన్నవారు 27 నక్షత్రాలను కంఠస్థం చేయడం తప్పనిసరి. 27 నక్షత్రాలను 3 భాగాలు చేసి ఒక్కో భాగంలో 9 నక్షత్రాలు ఉంటాయి. ఆ 9 నక్షత్రాలను ఇంకో 3 భాగాలు చేస్తే ఒక్కో భాగంలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఇలా భాగాలుగా విభజించుకుని గుర్తు పెట్టుకోడం చాలా సులభంగా ఉంటుంది.