సౌర కాలమానం (solar time)
1 సౌర దినం (solar day) = ఒక రోజు మిట్ట మధ్యాహ్నం నుంచి మరొక రోజు మిట్ట మధ్యాహ్నం వరకు.
1 మధ్యమ సౌర దినం (mean solar day) = 24 గంటలు = 60 ఘడియలు
1 గంట = 60 నిమిషములు = 2.5 ఘడియలు
1 నిమిషము = 60 సెకనులు
1 ఘడియ = 60 విఘడియలు = 24 నిమిషములు
1 విఘడియ = 24 సెకనులు
నక్షత్రం = 13° 20'
ద్రేక్కాణము = 10°
రాశి నవాంశ లేక నక్షత్ర పాదం = 3° 20'
ద్వాదశాంస = 2° 30'
త్రింశాస = 1°
నక్షత్ర కాలము (siderial time)
సూర్యునితో సంబంధం లేకుండా, అంతరిక్షంలో స్థిరమైన నక్షత్రాన్ని (fixed star) అనుసరించి, భూమి తన చుట్టూ ప్రదక్షిణ చేయుటకు పట్టు కాలం. ఒక రోజులో భూమి తన కక్షలో (360/365.5)° ముందుకు పోవును. 1° అనగా 3 నిమిషాల 56 సెకనులు.
స్థానిక కాలం (Local Mean Time)
తులాంశము (longitude) బట్టి కాలం.
ప్రమాణ కాలం (Standard Time)
దేశానికి ఒక ప్రమాణ కాలం, తూర్పు + పడమర తులాంశముల సరాసరి కాలం.
Note: 1-9-1942 to 15-1-1945 వరకు యుద్ధ సమయంలో ప్రమాణ కాలం ఇండియాలో సహా చాలా దేశాలలో 1 గంట ముందుకు పెట్టడం జరిగింది.
ఉదా: భారత ప్రమాణ కాలం ప్రకారం అమరావతి లో 6 pm అప్పుడు స్థానిక కాలం ఎంత?
భారత మధ్యగత తులాంశం 82.5°
అమరావతి తులాంశం 77.75°
బేధం = 4.75° = 18 నిమిషాలు 40 సెకండ్లు
అమరావతి స్థానిక సమయం 5:42 pm
మండల కాలం (Zonal Time)
రష్యాలో తూర్పు పడమర స్థానిక కాలాల వ్యత్యాసం 10 గంటలు. అందుకని మండలాలుగా విభజించి, ఆ మండల పరిధిలోని ప్రాంతాలకు, ఆ మండల తులాంశ కాలాన్ని వర్తింప చేయును.
GMT (Greenwich Mean Time)
0 degrees ప్రదేశం. తూర్పు వైపు 180 degrees (at 180 E, సూర్యోదయం మొదలు). పశ్చిమ 180 degrees.