వారాలు - గ్రహాలు - గుళికకాలం - యమగండం - రాహుకాలం

మనకు వారంలో మొత్తం 7 రోజులు ఉంటాయి. ఒక్కో రోజుకి ఒక్కో పేరు ఉంటుంది. ఒక్కో వారం ఒక్కో గ్రహానికి చెందినదని కింది పట్టికను చూచి గమనించగలరు. మన శాస్త్రాల ప్రకారం ఒక్కో రోజు కొన్ని పనులు చేయడం శుభం, ఇంకొన్ని పనులు చేయడం అశుభం అని మన పెద్దలు చెబుతూ ఉండటం వినే ఉంటాము. వాటిని క్రోడీకరించి సులభంగా అర్థమయ్యేలా ఈ క్రింద వ్రాయడం జరిగింది.
వారము గ్రహము గుళికకాలం రాహుకాలం యమగండం
ఆదివారము రవి [7] 03-00 PM to 04-30 PM [8] 04-30 PM to 07-00 PM [5] 12-00 PM to 01-30 PM
సోమవారము చంద్రుడు [6] 01-30 PM to 03-00 PM [2] 07-30 AM to 09-00 AM [4] 10-30 AM to 12-00 PM
మంగళవారము కుజుడు [5] 12-00 PM to 01-30 PM [7] 03-00 PM to 04-30 PM [3] 09-00 AM to 10-30 AM
బుధవారము బుధుడు [4] 10-30 AM to 12-00 PM [5] 12-00 PM to 01-30 PM [2] 07-30 AM to 09-00 AM
గురువారము గురుడు [3] 09-00 AM to 10-30 AM [6] 01-30 PM to 03-00 PM [1] 06-00 AM to 07-30 AM
శుక్రవారము శుక్రుడు [2] 07-30 AM to 09-00 AM [4] 10-30 AM to 12-00 PM [7] 03-00 PM to 04-30 PM
శనివారము శని [1] 06-00 AM to 07-30 AM [3] 09-00 AM to 10-30 AM [6] 01-30 PM to 03-00 PM
రాహుకాలం మరియు యమగండం కొత్త పనులకు అనుకూలం కాదు.
సూర్యోదయ (06-00 AM) మరియు సూర్యాస్తమయ (06-00 PM) మధ్య సమయాన్ని 8 ముహూర్తములుగా విభజించిన ప్రతి ముహూర్తం 90 నిమిషములు వచ్చును. క్రింది పట్టికలో ముహుర్త సంఖ్యను [ ] లో పేర్కొనబడింది.

Related