ఈ దశా విధానాన్ని పరాశర మహర్షి సృష్టించారు. ఈ దశ ప్రకారం మానవునికి 120 సంవత్సరాల దశాకాలం ఉంటుంది. ఇందులో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దశ చొప్పున మొత్తం 9 దశలు ఉంటాయి. మన భారత దేశంలో ఎక్కువ మంది పండితులు ఈ విధానాన్ని అనుసరిస్తారు. ప్రథమ నమకంలో మొదటి 9 నక్షత్రాలు, రెండవ నమకంలో తర్వాతి 9 నక్షత్రాలు మరియు మూడవ నమకంలో ఆఖరి 9 నక్షత్రాలు ఉంటాయి.
దశాధిపతి |
దశాకాలం (సం) |
నక్షత్రాలు |
కేతువు |
7 |
అశ్వని, మఖ, మూల |
శుక్రుడు |
20 |
భరణి, పుబ్బ, పూర్వాషాఢ |
రవి |
6 |
కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ |
చంద్రుడు |
10 |
రోహిణి, హస్త, శ్రవణం |
కుజుడు |
7 |
మృగశిర, చిత్త, ధనిష్ట |
రాహువు |
18 |
ఆరుద్ర, స్వాతి, శతభిషం |
గురుడు |
16 |
పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర |
శని |
19 |
పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర |
బుధుడు |
17 |
ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి |