చిరు-152 ఫస్ట్ లుక్ విడుదల చేసిన రామ్ చరణ్

మెగా స్టార్ చిరంజీవి గారి 152 చిత్రం ఫస్ట్ లుక్ ను రామ్ చరణ్ గారు ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. దాంతో పాటు ',,,Meet you on Aug22nd at 4PM !!' అంటూ చిరంజీవి జన్మదినం సందర్భంగా అభిమానుల కోసం సర్ప్రైజ్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ గారు దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ లో రామ్ చరణ్ నిర్మాతగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది.

రామ్ చరణ్ వరుసగా తన తండ్రితో మూడో చిత్రానికి నిర్మాతగా వ్యవరిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సందర్భంగా, వి.వి.వినాయక్ గారి దర్శక్వంలో తెరకెక్కిన 'ఖైదీ నెం 150' చిత్రాన్ని అభిమానులు ఘనంగా ఆహ్వానించారు. ఆ తరువాత సురేందర్ రెడ్డి గారి దర్శకత్వంలో రూపొందిన ' సైరా నరసింహా రెడ్డి ' అభిమానులకు కొంత నిరాశను మిగిల్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి కొంచెం గ్యాప్ ఇచ్చారు.రచయిత నుంచి దర్శకత్వం లోకి అడుగు పెట్టిన కొరటాల శివ దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలు కమర్షియల్ గా చాలా బాగా సక్సెస్ అయ్యాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సమాజానికి ఒక మెసేజ్ ను అద్భుతంగా అందించడంలో కొరటాల శివను ఖచ్చితంగా ప్రశంసించాల్సిన అవసరం ఉంది. చాలా చిత్రాలు ఒక మెసేజ్ ను ఇచ్చే ఉద్దేశంతో కథనం అదుపు తప్పి బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా కొట్టిన సందర్భాలు చాలా ఎక్కువ.


కరోనా నేపథ్యంలో షూటింగ్ లు ఆపేసిన తరుణంలో తమ అభిమాన తారల చిత్రాల విడుదల కాక అందరు అభిమానులు కొంచెం నిరాశలో ఉన్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసిన సందర్భంగా మెగా అభిమానులు ఈ చిత్రం కోసం చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రారంభమై అభిమానుల ముందు సందడి చేయాలని కోరుకుందాం.


జై చిరంజీవ !!


Related