చందమామ చిత్రంతో తెలుగు వెండి తెరకు పరిచయమై దాదాపు అగ్ర తారలందరితో కథానాయికగా నటించి తెలుగు సినీ అభిమానులకు సుమారు 13 సంవత్సరాల పాటు కనువిందు చేసిన కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30, 2020 న ముంబై వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది.
కరోనా వల్ల ముంబైలో అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో తగు జాగ్రత్తలతో వైభవంగా జరిగింది. ఈ సంవత్సరంలో ఇప్పటికే రానా, నితిన్, నిఖిల్, నిహారిక మొదలగు సినీ తారలు వివాహం జరగడం విశేషం.
తెలులోనే కాక హిందీ, తమిళ భాషల్లో నటించి తనదైన గుర్తింపు తెచ్చుకున్న కాజల్ వివాహం తర్వాత సినిమాలు చేస్తుందా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
శ్రీరస్తు ! శుభమస్తు !! అంటూ మా తరపున కొత్త పెళ్లి జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము.