శర్వానంద్, రష్మిక జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వం

కరోనా కారణంగా షూటింగ్ లు ఆపేసిన తరువాత మెల్ల మెల్లగా ఒక్కో సినిమా పట్టలెక్కుతున్నాయి. నేడు తాజాగా శర్వానంద్, రష్మిక జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఒక చిత్రాన్ని తిరుపతిలో నేడు ప్రారంభించారు.

గతంలో కిషోర్ తిరుమల గారు నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి మొదలగు చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి హిట్ లను అందుకున్నారు. తన డైలాగ్స్ తో మంచి పేరును సంపాదించుకున్నారు. సుధాకర్ చెరుకూరి గారు గతంలో శర్వానంద్ తో పడి పడి లేచే మనసు చిత్రానికి నిర్మాతగా వ్యవరంచి ఉన్నారు.

శర్వానంద్ కి తన పాత్రల పరంగా, కిషోర్ తిరుమలకు తన మాటల పరంగా ప్రత్యేక అభిరుచి ఉన్న నేపథ్యంలో, ఈ చిత్రానికి రష్మిక రూపంలో అదృష్టం తోడవ్వాలని కోరుకుందాం.

Related