పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా, సరిగ్గా 50 రోజుల ముందుగా ఆయన అభిమానులు #AdvancedHBDPawanKalyan ట్యాగ్ పేరిట 24 గంటల్లో 27.3 మిలియన్ ట్వీట్స్ తో ఇండియాలోనే టాప్ ట్రెండ్ చేసి రికార్డు సృష్టించారు. దీని ముందు రికార్డ్ జూ.యంటీఆర్ గారి జన్మదినం సందర్భంగా #HBDNTR ట్యాగ్ తో 21.5 మిలియన్ ఉండేది.
ఇందులో విశేషం ఏమిటంటే జూ. యన్టీఆర్ గారి బర్త్ డే ట్రెండ్ ని, పవన్ గారి అభిమానులు అడ్వాన్స్డ్ బర్త్ డే ట్రెండ్ తో బద్దలు కొట్టారు. ఇలా అడ్వాన్స్డ్ బర్త్ డే నే ఇలా ఉంటే బర్త్ డే ట్రెండ్ ఇంకే రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి అని మనకే వదిలేశారు. కాలగమనంలో ఒకరి రికార్డ్ మరొకరు టేక్ ఓవర్ చేయడం సాధారణమే. అయినప్పటికీ దీని మీద కొంతమంది యాంటీ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నా, మరికొంత మంది ఇతర అభిమానులు పాజిటివ్ గా తీసుకోవడం అభినందించే అంశం.
ఆనందంతో కేక్ కట్టింగ్ ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ మరియు సోషల్ సర్వీస్ (ఫుడ్ డొనేషన్) చేస్తూ అభిమానులు ఇలా పోస్ట్ చేశారు.