ప్రభాస్ గారు తన 22 వ చిత్రాన్ని "ఆదిపురుష్" అనే పేరు మరియు ఇది ప్యాన్ ఇండియా చిత్రమని అధికారికంగా ప్రకటించారు. ఆదిపురుష్ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషల్లో రూపొందనుంది. ఈ లాక్ డౌన్ లో వరుసగా మూడో చిత్రాన్ని ప్రభాస్ ప్రకటించారు. 'రాధే శ్యామ్ ' మరియు నాగ్ అశ్విన్ తో మరో సినిమా చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ రెండు కూడా ప్యాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ప్రభాస్ మార్కెట్ బాలీవుడ్ స్టార్లకు ధీటుగా పెరిగింది.
ఈ చిత్రం ఫస్ట్ లుక్ పరిశీలిస్తే, రామాయణ ఇతిహాసం ఆధారంగా సాగుతుందని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ రాముని పాత్రలో కనిపిస్తారని ఊహాగానాలు చేస్తున్నారు. అభిమానులు ప్రభాస్ ను రామునిగా చేసిన ఫోటో ఎడిటింగ్స్ సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఫస్ట్ లుక్ చాలా ఆకర్షణీయగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ఉంది. 'CELEBRATING VICTORY OF GOOD OVER EVIL' అనే ఉపశీర్షికను ఆదిపురుష్ టైటిల్ కి జత చేశారు.
ఈ చిత్రాన్ని టీ సీరీస్ భూషణ్ కుమార్ గారి నిర్మాణంలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ గారు చేయబోతున్నారు. ఈ విధంగా వరుస భారీ బడ్జెట్ చిత్రాల నేపథ్యం ప్రభాస్ అభిమానులకు గర్వించదగ్గ విషయం. ఈ చిత్రంతో ప్రభాస్ మరో మెట్టు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.