ఆచారాలు - సంప్రదాయాలు


భోజనం

 • ఉదయము రాజులా (100%), మధ్యాహ్నం భటునిలా (50%), రాత్రి బీదవానిలా (25%) తినవలెను.
 • నీరు ఎక్కువగా తీసుకోవాలి. భోజనానికీ దగ్గర సమయంలో తక్కువ మోతాదులో పుచ్చుకోవాలి.
 • అర్థరాత్రి నిద్ర మధ్యలో లేచిన, నీటిని తీసుకోవచ్చు.
 • పక్క మీద కూర్చుని ఏమియు తినరాదు.
 • నేల మీద చాపలాంటి దానిపై కూర్చుని తినాలి.
 • తినేటప్పుడు దృష్టి తిండిపై ఉండాలి. అనవసరమైన వాటిని చూడకూడదు, వినకూడదు, మాట్లాడకూడదు.
 • కాళ్ళు తడిగా ఉన్నప్పుడే భోజనము చేయడం దీర్ఘాయువు కలుగును.
 • ఎంగిలి చేతులతో తలను ముట్టుకొనరాదు.
 • ఎంగిలి చేతులతో ఎక్కడికి వెళ్ళకూడదు.
 • చేతిలోని తినుబండారాలను కొంచెం కొంచెంగా తినరాదు.
 • ఆసనము మీద పెట్టుకుని తినరాదు.
 • రాత్రి సమయంలో నువ్వులతో చేసినవాటిని తినకూడదు.

నిద్ర

 • తడి కాళ్ళతో నిద్రకు ఉపక్రమించండి.
 • వస్త్రహీనుడై పడుకోకూడదు.
 • తినిన వెంటనే పడుకోరాదు.
 • రాత్రి 10 గంటల నుండి, ఉదయం 4 గంటల వరకు ఉత్తమం.
 • సూర్యోదయం నుంచి, సూర్యాస్తమం వరకు నిద్రించరాదు. రోగములు కల్గును.

స్నానం

 • శిరస్సును విడిచి కేవలము కంఠ స్నానము చేయరాదు. (శిరఃస్నానము ఆరోగ్య భంగకరమైనప్పుడు స్నానము చేసియే కర్మానుష్టాన చేసి కొనవచ్చునని జాబాలి వచనము).
 • చల్ల నీటితో చేసేటప్పుడు శిరస్సు నుంచి పాదం వరకు తడపవలెను.
 • వీడి నీటితో చేసేటప్పుడు పాదం నుంచి శిరస్సు వైపుకు పోసుకోవాలి.

గోళ్ళు క్షవరం

 • వేళ పాళా లేకుండా చేతి గోళ్ళను కత్తిరించడం, తల వెంట్రుకలు తీయడం చేయకూడదు.
 • చేతి గోళ్ళను తిన్నవాడు విశానమును పొందుతారు.
 • మంగళ, శుక్ర వారాల్లో క్షవరం తగదు. శనివారం శ్రేయస్కరం.

ఇల్లు

 • ఇంటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
 • ఇంటిలోకి గాలి వెలుతురు పుష్కలంగా ఉండేట్లు చూసుకోవాలి.
 • ఇంటిని ఉప్పు నీటితో తుడవడం శ్రేయస్కరం.
 • ఇంటి గుమ్మానికి పసుపు నిండుగా పూసి, కుంకుమ బొట్లతో అలంకరించాలి.
 • ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు ఉత్తమం. ప్రాణవాయువు లభించును.
 • బయట ప్రయాణం చేసి ఇంటిలోనికి ప్రవేశించే ముందు కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కొని రావలెను. గుడి నుంచి తిరిగి వచ్చిన యెడల మొదట ఇంటిలోనికి ప్రవేశించి తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవచ్చు.
 • ఇంటి ఆవరణంలో మఱ్ఱి, ముళ్ళ చెట్ట్లు, పాలు కారే చెట్లు పెంచరాదు.

ప్రయాణం - శకునాలు

 • ముఖ్యమైన పనులకు రాహుకాలం, యమగండం, వర్జ్యం లేని వేళలు బయలుదేరాలి.
 • పిల్లి, విధవరాలు అశుభ శకునం.

ఇతరములు

 • జీవ హింస చేయరాదు. పశు పక్ష్యాదులను ఎల్లప్పుడూ దయతో చూడవలెను.
 • మూగ జీవులకు ఆహారం, నీరు అందించండి. చీమలకు బియ్యం గింజలు చల్లండి.
 • ఊరకే మట్టిని మర్థించడం, గడ్డి పరకలను తుంచడం, ఎదుటి వారి దోషములను వెల్లడించడం, నిందలు వేయడం, శుభ్రత పాటించకపోవడం చేయరాదు. శీఘ్ర వినాశము పొందుదురు.
 • రాత్రులందు చెట్ల కింద ఉండరాదు. దూరముగా ఉండవలయును.
 • ఎక్కువ కాలం జీవించాలనుకునే వాడు వెంట్రుకలు, బూడిదలను, ఎముకలను, కుండ పెంకులను, దూదిని, ధాన్యపు ఊకను తొక్కరాదు.
 • సరదా కోసం కూడా పాచికలు, జూదము ఆడరాదు.
 • పాదరక్షలు చేతితో మోయారాదు.
 • రెండు చేతులతోను తలగోక కూడదు.
 • ప్రహరీ (ప్రాకారము) కల్గిన గ్రామము/ఇంటిని ద్వారము గుండా మాత్రమే ప్రవేశించాలి.

Related