నామకరణము అనగా పుట్టిన బిడ్డకు పేరు పెట్టే శుభకార్యం. దీనినే బారసాల మరియు బాలసారె అని కూడా అంటారు. ఇదే కార్యక్రమంలో శిశువుకి మ్రొలతాడు ధారణ, ఊయలలో వేయడం చేస్తారు. ఈ హిందూ సంప్రదాయాన్ని ఆది శంరాచార్యులవారు క్రీ.పూ. 2000 వ సంవత్సరంలో ప్రారంభించారు.
  • ఈ నామకరణ ఉత్సవాన్ని, సాధారణంగా దేవాలయాలలో పురోహితుని ఆధ్వర్యంలో, అమ్మాయి పుట్టింటి వాళ్ళు జరిపించడం ఆనవాయితీ.
  • ఈ కార్యక్రమాన్ని, సాధారణంగా శిశువు పుట్టిన 11వ రోజు, 16వ రోజు, 21వ రోజు, 3వ నెల లేదా 29వ నెలలో నిర్వహిస్తారు.
  • తండ్రి శిశువుని ఒడిలో కూర్చోబెట్టుకుని, నిర్ణయించిన నామాన్ని, శిశువు చెవిలో మూడు సార్లు మెల్లిగా ఉచ్చరిస్తాడు (గుసగుసగా). తరువాత ఉంగరపు వేలుకి దర్భగడ్డిని ధరించి, పళ్ళెంలో బియ్యం పోసి, బంగారు/వెండి వస్తువు ఉపయోగిస్తూ, ఆ బియ్యంలో పేరు రాయిస్తారు. తర్వాత మిగిలిన ముఖ్యమైన వారు వ్రాయిస్తారు.
  • శిశువు మామయ్య ఆవు పాలు, తేనె లో బంగారు ఉంగరాన్ని ఉంచి, దాన్ని బిడ్డ నాలుకపై ఉంచి ఆశీర్వదిస్తారు.
  • దీనికి ఇరుగు పొరుగువారు వచ్చి బిడ్డను ఆశీర్వదించి, తాంబూలం పుచ్చుకుంటారు.
  • సాధారణంగా, పురుషులకు సరి సంఖ్య గల, స్త్రీలకు బేసి సంఖ్య గల అక్షరములతో ఉన్న నామములతో నామకరణము చేస్తారు.
  • పుట్టిన జన్మలగ్నం బట్టి, ఈ క్రింది పట్టికను ఆధారంగా చేసుకుని పురోహితుడు అర్థవంతమైన నామమును నిర్ణయిస్తారు.
రాశి నక్షత్రం పాదము(లు) పేరులో మొదటి అక్షరం
మేషం అశ్వని 4వ పాదము చూ, చే, చో, ల
మేషం భరణి 4వ పాదము లీ, లూ, లే, లో
మేషం కృత్తిక 1వ పాదము ఆ, ఈ, ఊ, ఏ
వృషభం కృత్తిక 2, 3, 4 పాదములు ఆ, ఈ, ఊ, ఏ
వృషభం రోహిణి 4వ పాదము ఓ, వా, వీ, వు
వృషభం మృగశిర 1, 2, 3, 4 పాదములు వే, వో, కా, కీ
మిథునం ఆరుద్ర 4వ పాదము కూ, ఖం, జా, చ్ఛా
మిథునం పునర్వసు 1, 2, 3 పాదములు కే, కో, హా, హి
కర్కాటకం పునర్వసు 4వ పాదము కే, కో, హా, హి
కర్కాటకం పుష్యమి 4వ పాదము హూ, హే, హో, డ
కర్కాటకం ఆశ్లేష 4వ పాదము డీ, డూ, డే, డో
సింహం మఖ 4వ పాదము మా, మీ, మూ, మే
సింహం పుబ్బ 4వ పాదము మో, టా, టీ, టూ
సింహం ఉత్తర 1వ పాదము టే, టో, పా, పీ
కన్య ఉత్తర 2, 3, 4 పాదములు టే, టో, పా, పి
కన్య హస్త 4వ పాదము పూ, షా, ణా, ఠా
కన్య చిత్త 1, 2 పాదములు పే, పో, రా, రీ
తుల చిత్త 3, 4 పాదములు పే, పో, రా, రీ
తుల స్వాతి 4వ పాదము రూ, రే, రో, తా
తుల విశాఖ 1, 2, 3 పాదములు తీ, తూ, తే, తో
వృశ్చికం విశాఖ 4వ పాదము తీ, తూ, తే, తో
వృశ్చికం అనురాధ 4వ పాదము నా, నీ, నూ, నే
వృశ్చికం జ్యేష్ఠ 4వ పాదము నో, యా, యీ, యూ
ధనస్సు మూల 4వ పాదము యే, యో, బా, బీ
ధనస్సు పూర్వాషాఢ 4వ పాదము బూ, ధా, భా, డా
ధనస్సు ఉత్తరాషాఢ 1వ పాదము బే, బో, జా, జీ
మకరం ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు బే, బో, జా, జీ
మకరం శ్రావణం 4వ పాదము జూ, జే, జో, ఖా
మకరం ధనిష్ట 1, 2 పాదములు గా, గీ, గూ, గే
కుంభం ధనిష్ట 3, 4 పాదములు గా, గీ, గూ, గే
కుంభం శతభిషం 4వ పాదము గో, సా, సీ, సూ
కుంభం పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు సే, సో, దా, దీ
మీనం పూర్వాభాద్ర 4వ పాదము సే, సో, దా, దీ
మీనం ఉత్తరాభాద్ర 4వ పాదము దు, శా, ఝా, ధా
మీనం రేవతి 4వ పాదము దే, దో, చా, చీ
అశ్విని - చూ - చే - చో - ల
భరణి - లి - లూ - లే - లో
కృత్తిక - ఆ - ఈ - ఊ - ఏ
రోహిణి - ఓ - వా - వీ - వూ
మృగశిర - వే - వో - కా - కి
ఆరుద్ర - కూ - ఖం - జ్ఞా - చ్చా
పునర్వసు - కే - కో - హా - హీ
పుష్యమి - హూ - హే - హో - డా
ఆశ్లేష - డి - డు - డె - డో
మఖ - మా - మీ - మూ - మే
పుబ్బ - మో - టా - టీ - టూ
ఉత్తర - టే - టో - పా - పీ
హస్త - పూ - ష - ణా - ఠా
చిత్త - పే - పో - రా - రీ
స్వాతి - రూ - రే - రో - త
విశాఖ - తీ - తూ - తే - తో
అనూరాధా - నొ - నీ - నూ - నే
జ్యేష్ఠ - నో - యా - యీ - యూ
మూల - యే - యో - బా - బి
పూర్వాషాఢ - బూ - ధా - భా - ఢ
ఉత్తరాషాఢ - బే - బో - జా - జీ
శ్రవణం - జూ - జే - జో - ఖా
ధనిష్ట - గా - గీ - గూ - గే
శతభిషం - గో - సా - సీ - సూ
పూర్వాభాద్ర - సే - సో - దా - దీ
ఉత్తరాభాద్ర - దు - శ్యం - ఝూ - థా
రేవతి - దే - దో - చా - చీ

Related