అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా,
ప్రాప్తిః ప్రాకామ్యమీశత్వం వశిత్వం చాష్ట సిద్ధయః
సిద్ధి | లక్షణం |
---|---|
అణిమ | శరీరాన్ని సూక్ష్మ రూపంలోకి మార్చుకోగలగడం. |
మహిమ | శరీరాన్ని ఎంత పెద్దగానైనా మార్చుకోగలగడం. |
గరిమ | ఎంతటి బరువునైన ఎత్తగలగడం. |
లఘిమ | శరీరాన్ని తేలికగా మార్చుకోగలగడం. |
ప్రాప్తి | శూన్యం నుంచి కావలసిన వస్తువును సాధించడం. |
ప్రాకామ్యం | కోరుకున్నది సాధించడం. |
ఈశత్వం | అష్టదిక్పాలకులపై ఆధిపత్యం. |
వశత్వం | సకల జీవరాశులను వశం చేసుకోగలగడం. |