Recommended
రోజూ ఎక్కువ నీరు త్రాగడానికి ఉత్తమ మార్గాలురోజూ ఎక్కువ నీరు త్రాగడానికి ఉత్తమ మార్గాలుTHE MIND - An Invisible Friend & EnemyTHE MIND - An Invisible Friend & Enemyమహా శివరాత్రిమహా శివరాత్రిLCD, LED, OLED, AMOLED know more about display screen technologies LCD, LED, OLED, AMOLED know more about display screen technologies వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా సిగ్నల్ యాప్వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా సిగ్నల్ యాప్స్వప్నాన కురిసిన వానస్వప్నాన కురిసిన వానMy Bicycle Journey to HomeMy Bicycle Journey to Homeనడవవోయ్ ముందుకు ! నడవవోయ్ ముందుకు !!నడవవోయ్ ముందుకు ! నడవవోయ్ ముందుకు !!

శ్రీ వెంకయ్య స్వామివారి శరణాలు

* కాపాడవయ్యా వెంకయ్య స్వామి
శ్రీ గొలగమూడిలో కొలువున్న స్వామి
అగ్నిగుండములోన - వెలుగొందు స్వామి
అన్నదాన ప్రియనే - ఆనంద స్వామి
సకల సౌఖ్యాలు ఇచ్చేటి స్వామి
కోరిన వరము, నోసగేటి స్వామి
సమర్థ సద్గురు శ్రీ స్వామి నాధ
బ్రహ్మ తేజస్వి బ్రహ్మాండనాధ
త్రిమూర్తి రూపా త్రినాధ దేవా
* ప్రాణశక్తిలో కొలువైన స్వామి
అఖిలము, నీవైన - సర్వాంతర్యామి
మోహ, మదాలు తొలగించు స్వామి
మా తల్లి, తండ్రి నీవేను స్వామి
మా తోడు నీడగ నడిపించు స్వామి
సర్వదేవతా రూపము నీవే
కొలచిన వారి దేవుడ నీవే
ఆపద బాపేటి దైవము నీవే
సకలము నీవైన సర్వాంతర్యామి
* వేలి ముద్రతోనే - వేదన తీర్చే
విశ్వమంతా నిండి - వెలుగొందు స్వామి
చూపులేని వారి దీపము నీవే
ఆపద తీర్చేటి, అనాధనాధ
దీనుల పైన దయగల స్వామి
సమర్థ సద్గురు శ్రీ స్వామినాధ
విశ్వప్రాణాయ శ్రీ స్వామినాధ
తులసమ్మను కాచి, బ్రోచిన స్వామి
నీ పాద సేవయే నిజమైన ధ్యానం
* చరణమే శరణం, దేవాదిదేవా
ముక్కోటి దేవుళ్లు నీ రూపమయ్యా
రాముడు నీవే, కృష్ణుడు నీవే
ఆపద్భాంధవ - శ్రీ గురునాధా
సాధన మార్గాన్ని చూపిన దేవా
శ్రీ గొలగమూడి, ఆశ్రమవాసి
సర్వయోగముల రూపము నీవే
కలియుగ నాధ కామితఫలదా
వీరారాఘవ, స్వామివి నీవే
* పంచ భూతాలను, శాసించు స్వామి
బ్రహ్మాండాలను, సృజించు స్వామి
సంకల్ప మాత్రాన కనిపించు స్వామి
సాధురూపాయ శ్రీ స్వామి నాధ
శ్రీ రామచంద్రాయ, శ్రీ గురునాధా
శ్రీ భక్త బృంద వందిత స్వామి
విశ్వమే దేహమై వెలుగొందు స్వామి
చైతన్య రూపాన వెలుగొందు స్వామి
అన్ని జీవుల్లో ఆత్మవు నీవే
* సర్వత్ర నిండిన సర్వాంతర్యామి
సృష్టి యజ్ఞమే నీవైన స్వామి
జ్ఞాన స్వరూపా శ్రీ యోగనాధా
నాదోపాసన చేసిన స్వామి
ధర్మమే తానైన శ్రీ ధర్మతేజా
త్రికాల జ్ఞానివై, వెలుగొందు స్వామి
అవధూత భగవాన్ వెంకయ్య స్వామి
మోక్షము నిచ్చి బ్రోచేటి స్వామి
సచ్చిదానంద స్వరూప స్వామి
* ముక్తిమార్గము చూపించు స్వామి
దత్తావతార, దత్తావధూత
సమర్థ సద్గురు శ్రీ గురు స్వామి
సర్వరోగాలు బాపేటి స్వామి
పిలిచితే పలికేటి చల్లని స్వామి
విష్ణుస్వరూపా శ్రీ గురునాధ
ఈశ్వరరూపా శ్రీ గురుదేవా
పంచభూతాల - వెలుగొందు స్వామి
విశ్వమే దేహమై వెలుగొందు స్వామి
* వేలాది భక్తుల బ్రోచిన స్వామి
కామక్రోధాలు అణిచేటి స్వామి
నీపై భక్తిని కలిగించు స్వామి
మా గురువు, మా దైవం నీవే స్వామి
మా కంటి వెలుగైన, మమ్మేలు స్వామి
తలచిన వారి, తలపు నీవే
సకల జీవుల్లో కొలువైన స్వామి
నీ రక్ష మాపాలి శ్రీ రామ రక్ష
విభూది తోనే - సంపదలిచ్చే
* నడవలేని వారి చేయూత నీవే
చేయెత్తి మ్రొక్కిన చేయూత నీవే
దీనబాంధవా దేవాతి దేవా
రోసిరెడ్డికి చూపునిచ్చిన
నీ నామ ధ్యానమే నిత్య సౌభాగ్యం
ఓ దేవదేవ మహానుభావా
సిద్ధాయ నమః శ్రీ గురునాధా
శ్రీ రామకృష్ణా లీలారూపా
అనాధ రక్షక శ్రీ గురునాధ
* అవధూత గానే - చరించు స్వామి
యోగేశ్వరా - శ్రీ యోగినాధ
ఏడుకొండల స్వామివి నీవే
సర్వాచార సంసేవితాయ
పుణ్యతీర్థాల వెలుగొందు స్వామి
సర్వజీవుల కాచేటి స్వామి
దిక్కులేని వారి దైవము నీవే
మహనీయమూర్తి శ్రీ స్వామినాధ
లోకాల నేలేటి శ్రీ సాయినాధ
* నాలుగు దిక్కులు నిండిన స్వామి
విశ్వానికంతా సాక్షివి నీవే
పరమాత్మ నీవే - పరమార్థ మీవే
నిర్గుణాయనమః శ్రీ సాయినాధ
సర్వశాస్త్రముల వెలుగొందు స్వామి
వూధితో బాధలు తీర్చేటి స్వామి
ఆధ్యాత్మబోధ చేసిన స్వామి
నారాయణ మంత్రంలో నివసించు స్వామి
గొలగమూడిలో కొలువున్న స్వామి
* కోరిక తీర్చి, కాచేటి స్వామి
ఆత్మజ్ఞానము కలిగించు స్వామి
మాపాలి దేవా, మమ్మేలు స్వామి
పేదల పాలిట పేన్నిధి నీవే
కలియుగనాధా కరుణించు స్వామి
సర్వదేవతా రూపం నీవే
నమ్మినవారిని దయతో కాచే
కాపాడవయ్యా వెంకయ్య స్వామి
కరుణించవయ్యా వెంకయ్య స్వామి
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
||కా||
గమనిక: ప్రతి వచనమునకు "కాపాడవయ్యా వెంకయ్య స్వామి" కలిపి చదువవలెను.

Related