రుద్రాక్షలు - రకాలు

రుద్రాక్ష (రుద్రుడు + అక్ష = శివుని కన్ను) అనగా పరమేశ్వరుని స్వరూపం.
పూర్వం పరమశివుడు శ్రీశైల క్షేత్ర తూర్పు ద్వారమైన త్రిపురాంతక క్షేత్రం వద్ద త్రిపురాసురలను (3 పురముల అసురులను) యుద్ధంలో భస్మం చేశాడు. తర్వాత వారిని చూసి దుఖించి కన్నీళ్లను విడువగా అవి భూమి మీదకు చేరి, వృక్షములుగా మారినవి. ఆ వృక్షములకు కాసిన కాయలను రుద్రాక్షలు అందురు.
పురాణాల్లో 38 రకాలుగా పేర్కొన్నారు. పండితులు మొత్తం 21 రకాలు ప్రబోధించారు. నేడు 14 రకాలు మాత్రమే లభించును. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు కోడిగుడ్డు ఆకారంలో ఉండి, తర్వాత ఎండి కుచించుకుని గుండ్రముగా మారి, తొడిమ రాలి, మధ్యలో ఖాళీ ఏర్పడి దారము గుచ్చునకు వీలుగా మారును.
రకము [సంకేతం] వివరణ
1 ఏకముఖి [శివుని త్రినేత్రం] అత్యంత శ్రేష్ఠమైనది వ్యక్తి వికాసం, జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరతాయి.
2 ద్విముఖి [అర్ధనారీస్వర తత్వం] కుండలినీ శక్తి పెరుగుతుంది.
3 త్రిముఖి [అగ్ని, త్రిమూర్తులు] ఆరోగ్యానికీ, అభ్యుదయానికీ ఉపకరిస్తుంది.
4 చతుర్ముఖి [బ్రహ్మ, 4 వేదాలు] పాలలో వేసి త్రాగితే మానసిక రోగాలు నయమవుతాయి. విద్యార్ధులకు బాగా ఉపకరిస్తుంది.
5 పంచముఖి [పంచ భూతములు] అధికంగా లభించును. గుండె జబ్బులున్నవారికి మంచిది. శతృవులను సులభంగా జయించవచ్చు. పాము కాటునుంచి రక్షణ కలుగుతుంది.
6 షణ్ముఖి [కార్తికేయుడు] రక్తపోటు, హిస్టీరియా పోతాయి.
7 సప్తముఖి [కామధేనువు] అకాల మరణం సంభవించదు
8 అష్టముఖి [విఘ్నేశ్వరుడు] కుండలినీ శక్తి పెరుగుతుంది.
9 నవముఖి [భైరవుడు] దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి.
10 దశముఖి [జనార్ధనుడు] అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు.
11 ఏకాదశముఖి [రుద్రుని 11 రూపాలు] దుష్ట శక్తులనుంచి కాపాడుతుంది.
12 ద్వాదశముఖి [12 మంది ఆద్యులు].
గౌరవం పెరుగుతుంది.
13 త్రయోదశముఖి [కామధేనువు, కార్తికేయుడు] పాలలో వేసి, ఆ పాలను త్రాగితే అందం పెరుగుతుంది.
14 చతుర్దశముఖి ఉపనిషత్తుల ప్రకారం ఇది పరమశివుని కన్ను.
15 పంచదశముఖి [పశుపతి] ఆధ్యాత్మిక సాధనకు ఉపకరిస్తుంది.
16 షోడశముఖి [కల్పిమాడుకు]
17 సప్తదశముఖి [విశ్వకర్మ] దీని వలన సంపద కలుగుతుంది.
18 అష్టాదశముఖి ఇది భూమికి తార్కాణం.
19 ఏకోన్నవింశతిముఖి [నారాయణుడు]
20 వింశతిముఖి [సృష్టికర్త బ్రహ్మ]
21 ఏకవింశతిముఖి [కుబేరుడు] అత్యంత అరుదైన రుద్రాక్ష. ఈ రుద్రాక్షలతో తయారైన మాలను ఇంద్ర మాల అంటారు. ఇంద్రమాలను ధరిస్తే ఇక వారికి దుస్సాధ్యమేదీ లేదు. జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరుతాయి.
రుద్రాక్ష చెట్టు "ఎలయో కార్పస్" వర్గానికి చెందినది. ఈ చెట్టు 60 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని పూలు తెల్లగా ఉండి ఆకులకన్నా చిన్నవిగా ఉంటాయి. ఈ చెట్టు ఫిబ్రవరిలో పూతకు వస్తుంది. రుద్రాక్షలు ప్రధానంగా తేనె, నలుపు, తెలుపు రంగులతోపాటు మిశ్రమ రంగుల్లో లభ్యమవుతాయి.
రుద్రాక్షలు అత్యంత శక్తివంతమైనవనీ, వీటిని ధరించిన ఎడల వైవాహిక, వ్యాపార, అనారోగ్య మరియు అన్ని రకాల సమస్యలు పోయి, ఎటువంటి చెడు ప్రభావం తమపై పడదనే నమ్మకం. ఏ రోజు చేసిన పాపాలు రోజే నశిస్తాయని ప్రతీతి.

రుద్రాక్ష ధారణ నియమాలు

 • ప్రతి ఒక్కరూ ధరించవచ్చును.
 • గుండ్రంగా ముల్లుతో ఉండి, శ్రేష్టమైన వాటిని ధరించాలి.
 • పుష్యమి నక్షత్రం లేదా సోమవారం నాడు, శుభ సమయంలో రుద్రాక్షలను శుద్ధి చేసి, శివ పూజ చేసిన పిదప, ఆ రుద్రాక్షను ధరించాలి.
 • పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి నాడు ఈశ్వరుని రుద్రాక్షలతో పూజించడం శుభకరం.
 • రుద్రాక్ష ధరించే ముందు పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. సంవత్సరానికి ఒక్కసారైనా మాలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయడం శుభకరం. వీలైనంత వరకు శివరాత్రి చేయడం మంచిది.
 • ఒకరి రుద్రాక్షను మరొకరు ధరించకూడదు.
 • ఉంగరంలో ధరించకూడదు.
 • వీటిని బంగారం, వెండి, రాగి తీగెలతోగానీ, సిల్కు దారముతోగూర్చిగానీ ధరించాలి.
 • పూజలలో 108/54/27 రుద్రాక్షలను బంగారము, వెండి లేదా రాగి తీగతో మాలగా తయారుచేయించి మెడలో ధరించవలెను. జప మాలగా కూడ ఉపయోగించవచ్చును.

రుద్రాక్ష ధరించిన వారి నియమాలు

 • రుద్రాక్షలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
 • మైల పడిన వారికి దూరంగా ఉండాలి.
 • స్త్రీలు రుతుసమయంలో ధరించకూడదు.
 • రుద్రాక్ష మాలను ధరించి నిద్ర పోకూడదు, శృంగారంలో పాల్గొనకూడదు.
 • స్మశానానికి వెళ్ళకూడదు.
 • వెల్లుల్లి, మాంసాహారం, ధూమపానం, మద్యపానంకు దూరంగా ఉండాలి.
 • సంభోగ సమయంలో ధరించకూడదు. పొరపాటున ధరించిన యెడల తరువాత వాటిని ఆవు పాలతో శుద్ధి చేసి, ధరించే ముందు శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

జన్మనక్షత్ర రీత్యా ధరించాల్సిన రుద్రాక్ష (ముఖములు)

 1. అశ్వని (9)
 2. భరణి (6)
 3. కృత్తిక (1, 12)
 4. రోహిణి (2)
 5. మృగశిర (3)
 6. ఆరుద్ర (8)
 7. పునర్వసు (5)
 8. పుష్యమి (7)
 9. ఆశ్లేష (4)
 10. మఖ (9)
 11. పుబ్బ (6)
 12. ఉత్తర (1, 12)
 13. హస్త (2)
 14. చిత్త (3)
 15. స్వాతి (8)
 16. విశాఖ (5)
 17. అనురాధ (7)
 18. జ్యేష్ఠ (4)
 19. మూల(9)
 20. పూర్వాషాఢ (6)
 21. ఉత్తరాషాఢ (1, 12)
 22. శ్రవణం (2)
 23. ధనిష్ట (3)
 24. శతభిషం (8)
 25. పూర్వాభాద్ర (5)
 26. ఉత్తరాభాద్ర (7)
 27. రేవతి (4)
తంత్ర శాస్త్ర ప్రకారం రుద్రాక్షలు ఎంత చిన్నవైతే అంత శక్తివంతమైనవి. అంటే ఉసిరిక కాయంత పరిమాణమున్నవి ఉత్తమమైనవిగా, రేగుపండంత పరిమాణమున్నవి మధ్యమ జాతికి చెందినవిగా, శనగ గింజ పరిమాణం ఉన్నవి అధమమైనవిగా పేర్కొనబడుతున్నాయి. కాబట్టి రుద్రాక్షలను ధరించే సమయంలో వాటి పరిమాణమును కూడా గమనించాల్సివుంటుంది.
రుద్రాక్షలకు నేపాల్ పుట్టినిల్లు. నేపాల్‌లోని పంచక్రోశి సమీపంలోని రుద్రాక్షారణ్యంలో మొదటిసారిగా రుద్రాక్ష జన్మించినట్లు చెప్పబడుతూ ఉంది. సంహరించడంతో నేపాల్, బెంగాల్, అస్సాం, మధ్య ప్రదేశ్, ముంబై ప్రాంతాల్లో ఈ చెట్లు విస్తారంగా ఉన్నాయి.
వివిధ రకాలైన సమస్యలతో బాధపడేవారు, వివిధ నక్షత్రాలు, రాసులవారు పండితుల సలహా మేరకు ఆయా ముఖాల రుద్రాక్షలను ధరిస్తే సత్ఫలితాలు ఉంటాయి. ఇవి వివిధ వ్యాధులను నయం చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. ప్రధానంగా రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, మూర్చ, జలుబు, గొంతు వాపు అజీర్ణం, శ్వాసకోశ వ్యాధులు మొదలైన వ్యాధులకు రుద్రాక్ష ఉపయోగపడుతుంది.
భారతీయ ఆధ్యాత్మిక సంపదలో భాగమైన రుద్రాక్షలు ధరిస్తే పునర్జన్మ ఉండదని భారతీయులు విశ్వసిస్తారు. ఆత్మ నిగ్రహానికీ, ఆత్మ సౌందర్యానికీ, మానసిక ప్రశాంతతకూ శక్తి వాహకాలైన వీటి ధారణ యోగ శక్తి పెంపొందించుకునేందుకూ, నిర్మలమైన, నిశ్చలమైన జీవితాన్ని సాగించేందుకూ తోడ్పడుతాయి.
అసలైన రుద్రాక్షలను గుర్తించే పద్ధతులు
* రెండు రాగి నాణెముల మధ్య రుద్రాక్షనుంచితే అది సవ్య దిశలో తిరుగుతుంది
* నకిలీ రుద్రాక్షను నీటిలోగానీ, పాలలోగానీ వేసినపుడు అది తేలుతుంది.
* నిజమైన రుద్రాక్షను పాలలో వేస్తే పాలు కొన్ని రోజుల వరకు విరగవు, చెడిపోవు.
* నిజమైన రుద్రాక్షను చల్లని నీటిలో వేస్తే అరగంటలో వేడెక్కుతాయి.
నిజమైన రుద్రాక్షలను గుర్తించడానికి కొన్ని పద్ధతులున్నాయి. అవి:
1) ఏకముఖి రుద్రాక్షలు ప్లాస్టిక్ లో వస్తాయి జాగ్రత్త వహించాలి.
2)ఏకముఖి రుద్రాక్షలు కెమికల్స్ తో కూడ వస్తాయి జాగ్రత్త వహించాలి.
3)"7"ముఖాల రుద్రాక్ష దగ్గర నుండి పెద్ద ముఖాల రుధ్రాక్షలు గీతలు చెక్కుతారు గమనించాలి.
4)రుధ్రాక్షకు ఏటువంటి పరీక్షలు గాని ఉండవు అనుభవంతో మాత్రమే గమనించాలి.
నామాక్షరాన్ని బట్టీ రుధ్రాక్ష ధారణ
← back to list page
చూ,చే,చో,ల,లీ,లూ,లే,లో ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి ,మేష లగ్నం,మేష రాశి వారికి,మృగశిర,చిత్త్ర,థనిష్ట నక్షత్రాల వారికి "3"ముఖాల రుద్రాక్ష గాని,"1","3","5"ముఖాలు కలిగిన రుద్రాక్షలను కవచంలాగ థరించ వచ్చును.
ఈ,ఊ,ఏ,ఓ,వా,వీ,వు,వే,వో ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, వృషభ లగ్నం వారికి,రాశి వారికి ,భరణి,పుబ్బ ,పూర్వాషాడ నక్షత్రాల వారికి "6" ముఖాల రుధ్రాక్ష గాని, "4","6","7" ముఖాలు కలిగిన రుధ్రాక్షలు గాని కవచం లాగ థరించ వచ్చును
.
కా,కి,కూ,ఖం,ఙ,ఛ,కే,కో,హా ప్రథమ నామాక్షరలు ఉన్న వారికి, మిథున లగ్నం వారికి ,రాశి వారికి ,ఆశ్లేష ,జ్యేష్ట ,రేవతి నక్షత్రాల వారికి "4" ముఖాల రుధ్రాక్ష గాని,"4',"6","7",ముఖాలు కలిగిన రుధ్రాక్షలు కవచం లాగ గాని థరించ వచ్చును .
హి,హు,హె,హూ,డా,డి,డూ,డే,డో, ప్రథమ నామాక్ష్రాలు ఉన్న వారికి,కర్కాటక లగ్నం వారికి ,రాశి వారికి, రోహిణి,హస్తా ,శ్రవణం, నక్షత్రాల వారికి "2"ముఖాల రుధ్రాక్ష గాని ,"2","3","5", ముఖాలు కలిగిన రుధ్రాక్షలు కవచంలాగ గాని ధరించ వచ్చును.
మా,మీ,మూ,మే,మో,టా,టి,టు,టే ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి,సింహా లగ్నం వారికి,రాశి వారికి, కృత్తిక,ఉత్తర ,ఉత్తరాషాడ నక్షత్రాల వారికి "1"ముఖం గాని, "1","3","5", ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును
.
టో,పా,పి,పూ,ష,ణ,ఢ,పె,పో ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, కన్య లగ్నం వారికి,రాశి వారికి ,ఆశ్లేష,జ్యేష్ట, రేవతి,నక్షత్రాల వారికి "4"ముఖాల రుధ్రాక్ష గాని,"4","6","7",ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును.
రా,రి,రూ,రె,రో,తా,తీ,తూ,తే,ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, తులా లగ్నం వారికి, రాశి వారికి,భరణి,పుబ్బ,పూర్వషాడ,నక్షత్రాల వారికి"6"ముఖాల రుధ్రాక్ష గాని ,"4','6","7"ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచంలాగ థరించ వచ్చును.
తో,నా,నీ,నూ,నే,నో,య,యి,యు,ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, వృశ్చిక లగ్నం వారికి, రాశి వారికి, మృగశిర,చిత్త్ర,థనిష్ట నక్షత్రాల వారికి "3"ముఖాల రుధ్రాక్ష గాని,"2","3","5"ముఖాల రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును .
యే,యో,బా,బి,బు,ధ,భ,ఢ,బే,ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి,థనస్సు లగ్నం వారికి, రాశి వారికి,పునర్వసు,విశాఖ,పూర్వాభాధ్ర,నక్షత్రాల వారికి "5"ముఖాల రుధ్రాక్ష గాని "1",'3","5"ముఖాల రుధ్రక్షలను కవచం లాగ థరించ వచ్చును.
బో,జా,జి,జు,జే,జో,ఖా,గ,గి,ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, మకర లగ్నం వారికి,రాశి వారికి,పుష్యమి,అనూరాధా,ఉత్తరాభాధ్ర నక్షత్రాల వారికి "7"ముఖాల రుధ్రాక్ష గాని,"4","6","7",ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును.
గూ,గే,గో,సా,సి,సు,సే,సో,దా,ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, కుంభ లగ్నం వారికి, రాశివారికి,పుష్యమి,అనూరాధా,ఉత్తరాభాధ్ర నక్షత్రాల వారికి"7"ముఖాల రుధ్రాక్ష గాని,"4","6","7"ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును.
ది,దు,శ్యం,ఝ,ద,దే,దో,చా,చి,ప్రథమ నామాక్షరలు ఉన్న వారికి, మీన లగ్నం వారికి,రాశి వారికి,పునర్వసు,విశాఖ,పూర్వాభాథ్ర నక్షత్రాల వారికి"5"ముఖాల రుధ్రాక్ష గాని,"2","3","5"రుధ్రాక్షలను కవచం లాగ ధరించ వచ్చును.

Related